Begin typing your search above and press return to search.

మెగా టైటిల్ లీక్.. ఈ కాకాజీ కథేంటి?

ఇప్పటికే ఫోటోషూట్స్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వడంతో, బాబీ తన టీమ్ తో కలిసి షూటింగ్ షెడ్యూల్స్ ను పక్కాగా రెడీ చేస్తున్నారు.

By:  M Prashanth   |   21 April 2026 4:29 PM IST
మెగా టైటిల్ లీక్.. ఈ కాకాజీ కథేంటి?
X

మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారంటే చాలు, దాని టైటిల్ దగ్గర నుండి కథా నేపథ్యం వరకు ప్రతి చిన్న విషయం ఇండస్ట్రీలో సెన్సేషన్ అవుతుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీతో ఆయన మళ్ళీ చేతులు కలపడంతో, ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చుట్టూ రకరకాల వార్తలు వినిపిస్తున్నా, తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

మెగాస్టార్ తన తర్వాతి చిత్రంలో గతంలో ఎన్నడూ చూడని ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. సాధారణంగా చిరంజీవి సినిమాలకు పవర్ ఫుల్ టైటిల్స్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. ఈ క్రమంలోనే మెగా 158 కోసం 'కాకాజీ' అనే వెరైటీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది, కానీ ఇప్పుడు మేకర్స్ దీనికే మొగ్గు చూపుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తోంది.

బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో చిరంజీవి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఆ క్యారెక్టర్‌ను అందరూ కాకాజీ అని పిలుస్తారని అందుకే ఆ పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేసినట్లు టాక్. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 20నే ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ప్రొడక్షన్ పరంగా ఎదురైన కొన్ని చిక్కుల వల్ల మే నెలకు వాయిదా పడింది. నిర్మాత మార్పు గురించి రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి అదే బ్యానర్ లో ముందుకు వెళ్లేలా మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఇప్పటికే ఫోటోషూట్స్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వడంతో, బాబీ తన టీమ్ తో కలిసి షూటింగ్ షెడ్యూల్స్ ను పక్కాగా రెడీ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, ఆడియో పరంగా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో కాస్టింగ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. చిరంజీవి సరసన ప్రియమణి నటిస్తుండగా, మోహన్ లాల్, అనురాగ్ కశ్యప్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

తండ్రి కూతురు మధ్య ఉండే బలమైన ఎమోషన్స్ కు మాస్ యాక్షన్ ను జోడించి బాబీ ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారta. కాకాజీ అనే టైటిల్ వినడానికి కొంచెం భిన్నంగా ఉన్నా, కథలో ఉండే ఇంటెన్సిటీకి ఇది పక్కాగా సెట్ అవుతుందని మెగా టీమ్ భావిస్తోంది. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చిత్ర యూనిట్ నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. టైటిల్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నా, సోషల్ మీడియాలో మాత్రం కాకాజీ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. షూటింగ్ మొదలైన తర్వాత ఫస్ట్ లుక్ తో పాటు ఈ టైటిల్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ మళ్ళీ తన ఫేవరెట్ డైరెక్టర్ బాబీతో కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటారో చూడాలి.