Begin typing your search above and press return to search.

మెగాస్టార్ స‌ర‌స‌న యంగ్ బ్యూటీ?

మెగాస్టార్ చిరంజీవి స్పీడు చూస్తుంటే కుర్ర హీరోలు కూడా దాన్ని త‌ట్టుకోలేరేమో అనిపిస్తుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   14 Oct 2025 4:00 PM IST
మెగాస్టార్ స‌ర‌స‌న యంగ్ బ్యూటీ?
X

మెగాస్టార్ చిరంజీవి స్పీడు చూస్తుంటే కుర్ర హీరోలు కూడా దాన్ని త‌ట్టుకోలేరేమో అనిపిస్తుంది. వ‌రుస సినిమాల‌ను చేస్తూ బిజీగా ఉన్న చిరూ, ఇప్ప‌టికే విశ్వంభ‌ర మూవీ షూటింగ్ ను పూర్తి చేసి, ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ సినిమా అంటే ఎంత స్పీడ్ గా పూర్త‌వుతుందో తెలిసిందే.

శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు షూటింగ్

శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు షూటింగ్ ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్న చిరూ, ఓ వైపు ఆ షూటింగ్ ను చేస్తూనే ఇప్పుడు మ‌రో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నారు. అనిల్ తో సినిమా త‌ర్వాత మెగాస్టార్.. బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. వాటిలో బాబీ సినిమాను ముందుగా చేయ‌నున్నారు చిరంజీవి.

బాబీతో మెగా158

చిరూ కెరీర్లో 158వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమా ఇప్ప‌టికే అనౌన్స్ కూడా అయింది. చిరూ, బాబీ కాంబినేష‌న్ లో గ‌తంలో వాల్తేరు వీర‌య్య సినిమా వ‌చ్చి ఆ సినిమా సూప‌ర్‌హిట్ గా నిలవ‌డంతో ఈ మూవీపై అంద‌రికీ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అస‌లే చిరంజీవి అభిమాని అయిన బాబీ, ఈసారి మెగా158తో వాల్తేరు వీర‌య్యను మించిన హిట్ అందుకోవాల‌ని చూస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం మెగా158 సినిమా న‌వంబ‌ర్ 5న పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లు కానుంద‌ని, జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో ఒక ఫీమేల్ లీడ్ కోసం మ‌ల‌యాళ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ తో మేక‌ర్స్ డిస్క‌ష‌న్స్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌లు విని నెటిజ‌న్లు ఒక్కొక్క‌రు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. చిరూ లాంటి సీనియ‌ర్ స్టార్ స‌ర‌స‌న న‌టించేందుకు మాళ‌విక ఒప్పుకుంటుందా అని కొంద‌రు ప్ర‌శ్నిస్తుంటే, మ‌రికొంద‌రు మాత్రం మెగాస్టార్ తో ఛాన్స్ వ‌స్తే వ‌దులుకుంటుందా అని అంటున్నారు. ఇంకొంద‌రైతే ఇద్ద‌రి మ‌ధ్యా ఏజ్ గ్యాప్ బాగా ఉంది కాబ‌ట్టి స్క్రీన్ పై వారి జంట ఆడియ‌న్స్ కు న‌చ్చుతుందో న‌చ్చ‌దో అని అభిప్రాయ‌ప‌డుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మాళ‌విక తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న ది రాజా సాబ్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.