Begin typing your search above and press return to search.

పుట్టిన‌రోజుకి 'చిరు'కానుక అదేనా?

మెగాస్టార్ చిరంజీవి ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తూ కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Aug 2025 12:51 PM IST
పుట్టిన‌రోజుకి చిరుకానుక అదేనా?
X

మెగాస్టార్ చిరంజీవి ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తూ కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తున్నారు. గ‌త కొన్ని సినిమాలుగా స‌రైన విజ‌యం అందుకోలేక‌పోతున్న చిరూ, ఇప్పుడు సినిమాల ఎంపిక విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించి మ‌రీ ఓకే చేస్తున్నారు. అందులో భాగంగానే ఎవ‌రూ ఊహించ‌ని డైరెక్ట‌ర్ల‌తో సినిమాల‌ను అనౌన్స్ చేసి అంద‌రికీ షాకిచ్చారు చిరంజీవి.

షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభ‌ర‌

ప్ర‌స్తుతం చిరూ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. అందులో ఒక‌టి వశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సోషియో ఫాంట‌సీ మూవీ విశ్వంభ‌ర కాగా మ‌రోటి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న మెగా157. ఈ రెండింటిలో ముందుగా విశ్వంభ‌ర రిలీజ్ కానుండ‌గా, రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌నున్నారు.

జెట్‌స్పీడ్ లో అనిల్

ఇక మెగా157 సినిమా విష‌యానికొస్తే అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగును ప‌రుగులు పెట్టిస్తున్నారు. మామూలుగానే సినిమాల‌ను వేగంగా పూర్తి చేసే అనిల్, ఈ సినిమాను మ‌రింత వేగంతో తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది. చూస్తుంటే మెగా157 ముందు అనుకున్న దాని కంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అనిపిస్తోంది.

మెగా157పై భారీ అంచ‌నాలు

ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా మెగా157పై అంద‌రికీ మంచి అంచనాలున్నాయి. అనిల్ కామెడీకి, రైటింగ్‌కి.. చిరూ కామెడీ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో చూడాల‌ని మెగా ఫ్యాన్స్ తో పాటూ స‌ద‌రు మూవీ ల‌వ‌ర్స్ కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వినిపిస్తోంది.

ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా మెగా157 టైటిల్ ను మేక‌ర్స్ రివీల్ చేస్తారంటున్నారు. టైటిల్ తో పాటూ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. సాహు గార‌పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండ‌గా, వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ముందు నుంచే చెప్తున్న విష‌యం తెలిసిందే.