Begin typing your search above and press return to search.

మీసాల పిల్ల.. క్రింజ్ అన్నారు కానీ..

ఇటీవల కాలంలో బాస్ ఈజ్ బ్యాక్.. వింటేజ్ గ్రేస్ ఈజ్ బ్యాక్.. అంటూ మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాన్స్ నుంచి స్ట్రాంగ్ ఎలివేషన్స్ వచ్చాయి.

By:  M Prashanth   |   16 Oct 2025 12:11 PM IST
మీసాల పిల్ల.. క్రింజ్ అన్నారు కానీ..
X

ఇటీవల కాలంలో బాస్ ఈజ్ బ్యాక్.. వింటేజ్ గ్రేస్ ఈజ్ బ్యాక్.. అంటూ మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాన్స్ నుంచి స్ట్రాంగ్ ఎలివేషన్స్ వచ్చాయి. ఇక అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే చూపిస్తానని మాటిచ్చిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఆ మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు. 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం నుంచి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.


లేటెస్ట్ గా విడుదలైన మొదటి సింగిల్ 'మీసాల పిల్ల' కేవలం రెండు రోజుల్లోనే యూట్యూబ్‌లో సృష్టించిన సంచలనం చూస్తే, ఇది ఆరంభం మాత్రమే అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ మ్యూజిక్ వీడియోస్ చార్ట్స్‌లో ఇండియా వైడ్ నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ మెగా ప్రభంజనాన్ని చూపిస్తోంది. మొదట్లో ఓ వర్గం నుంచి క్రింజ్ అనే కామెంట్స్ అందుకుంది.


కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ యూత్ మాత్రమే కాకుకూడా విబిన్న వయసుల వారు పాటను రీల్స్ చేస్తూ మరి వైరల్ చేశారు. పాన్ ఇండియా హడావుడి లేకపోయినా ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ఉదిత్ నారాయణ చాలా కాలం తరువాత మెగాస్టార్ పాట పాడడంలో వింటేజ్ వైబ్ ను తీసుకు వచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కు ఇది గోల్డెన్ ఛాన్స్ కావడంతో అతను కూడా ప్రాణం పెట్టి వర్క్ చేసినట్లు అర్థమవుతుంది.


'మీసాల పిల్ల' అలకకు, మెగాస్టార్ చూపించిన బుజ్జగింపుకి దేశం మొత్తం ఫిదా అయిపోయింది. ఈ పాటలో చిరంజీవి పలికించిన గ్రేస్, కామెడీ టైమింగ్ హావభావాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే పాటను పదే పదే రిపీట్ మోడ్‌లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్‌ను ఆటపట్టించే కొంటె చూపు నుంచి, క్షణాల్లో కామెడీతో కూడిన నిస్సహాయతను ముఖంలో పలికించడం ఆయనకే చెల్లింది.

ఆయన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్, పాత్ర యొక్క ఫ్రస్ట్రేషన్‌ను కూడా గ్రేస్‌ఫుల్‌గా చూపించిన విధానం గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ప్రమోషన్స్ ఆరంభంలోనే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించేలా సిద్ధం చేస్తున్నారు. ఈ ఒక్క పాటకే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే, ఇక సినిమా థియేటర్లలోకి వస్తే మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనని చెప్పడంలో సందేహం లేదు.