Begin typing your search above and press return to search.

మీసాల పిల్ల‌తో అద‌ర‌గొట్టిన మెగాస్టార్

సాంగ్ లో భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, ఉదిత్ నారాయ‌ణ, శ్వేతా మోహ‌న్ వాయిస్, భాస్క‌ర భ‌ట్ల సాహిత్యం అన్నీ అదిరిపోయాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   14 Oct 2025 5:22 PM IST
మీసాల పిల్ల‌తో అద‌ర‌గొట్టిన మెగాస్టార్
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న తాజా సినిమాల్లో మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు ఒక‌టి. టాలీవుడ హిట్ మిష‌న్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా న‌య‌న‌తార ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, అప్పుడే చిత్ర ప్ర‌మోష‌న్స్ ను మేక‌ర్స్ వేగ‌వంతం చేశారు.

మీసాల పిల్ల ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్

ఆల్రెడీ రిలీజైన పోస్ట‌ర్లు, ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్ మెగా ఫ్యాన్స్ తో పాటూ సాధార‌ణ ఆడియ‌న్స్ ను కూడా విప‌రీతంగా ఆక‌ట్టుకోగా, రీసెంట్ గా ద‌స‌రా సంద‌ర్భంగా మీసాల పిల్ల అనే ఫ‌స్ట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమోకు కూడా ఆడియ‌న్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రాగా, ఇప్పుడు మేకర్స్ మీసాల పిల్ల ఫుల్ లిరిక‌ల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

మ‌రోసారి అద‌ర‌గొట్టిన భీమ్స్

సాంగ్ లో భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, ఉదిత్ నారాయ‌ణ, శ్వేతా మోహ‌న్ వాయిస్, భాస్క‌ర భ‌ట్ల సాహిత్యం అన్నీ అదిరిపోయాయి. విజువ‌ల్స్ కూడా చాలా బావున్నాయి. సాంగ్ విన్నాక సినిమాలో చిరంజీవి, న‌య‌న‌తార భార్యాభ‌ర్త‌లుగా క‌నిపించనున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. త‌న‌పై అలిగిన న‌య‌న‌తార‌ను బుజ్జ‌గించే సంద‌ర్భంలో ఈ సాంగ్ ను తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది.

వింటేజ్ గ్రేస్ తో చిరూ

సాంగ్ లో మెగాస్టార్ ఎంతో ఈజ్ తో మ‌రింత గ్రేస్ తో స్టెప్పులేయ‌గా, ఆయ‌న వేసిన స్టెప్పులు వింటేజ్ చిరూని గుర్తుకు తెస్తున్నాయి. ఫ్యామిలీ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరూ క్యారెక్ట‌ర్ గ్యాంగ్‌లీడ‌ర్, ఘ‌రానా బుల్లోడు సినిమాల త‌ర‌హాలో ఉండ‌నుంద‌ని ఆల్రెడీ టాక్ వినిపిస్తోంది. చాలా రోజుల త‌ర్వాత ఉదిత్ నారాయ‌ణ, చిరూ కాంబినేష‌న్ లో వ‌చ్చిన పాట ఇది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఎన్నో సూప‌ర్‌హిట్ సాంగ్స్ రాగా ఇప్పుడు వ‌చ్చిన మీసాల పిల్ల కూడా ఆ లిస్ట్ లో నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేద‌ని పాట విన్నాక కచ్ఛితంగా చెప్పొచ్చు.

అప్పుడు ర‌మ‌ణ గోగుల.. ఇప్పుడు ఉదిత్..

ఈ ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో సూప‌ర్ హిట్ సినిమాను అందుకున్న అనిల్ రావిపూడి నెక్ట్స్ ఇయ‌ర్ సంక్రాంతికి భారీ ప్లానే వేసి, అందులో భాగంగానే చాలా ముందుగానే సినిమాకు ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టారు. ఇక భీమ్స్ విష‌యానికొస్తే సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో త‌న స‌త్తా ఏంటో మొద‌టి సాంగ్ తోనే నిరూపించుకున్నారు. గోదారి గ‌ట్టు మీద పాట కోసం చాలా కాలంగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్న ర‌మ‌ణ గోగుల‌ను తీసుకొచ్చిన భీమ్స్- అనిల్, ఇప్పుడీ సినిమా కోసం ఉదిత్ నారాయ‌ణ ను రంగంలోకి దింపి, ఈసారి కూడా మొద‌టి పాట‌తోనే త‌న నుంచి ఏ రేంజ్ ఆల్బ‌మ్ రాబోతుందో ముందుగానే క్లారిటీ ఇచ్చారు. చూస్తుంటే చిరూ కి కూడా భీమ్స్ సంక్రాంతికి వ‌స్తున్నాం త‌ర‌హా ఆల్బ‌మ్ ను రెడీ చేస్తున్న‌ట్టే అనిపిస్తుంది.