బాస్ గ్రేస్‌కు ఫిదా.. 'మీసాల పిల్ల' రికార్డుల మోత!
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్‌లో ఒకటే క్యూరియాసిటీ.
By: M Prashanth | 18 Oct 2025 10:36 PM ISTమెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్‌లో ఒకటే క్యూరియాసిటీ. వింటేజ్ చిరును మళ్లీ తెరపై చూపిస్తానని అనిల్ మాటివ్వడంతో, 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై అంచనాలు హై లెవెల్ కు వెళ్లాయి. ఆ అంచనాలకు తగ్గట్టే, సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఒక సెన్సేషన్‌తో మొదలయ్యాయి.
'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి ఫస్ట్ సింగిల్‌గా వచ్చిన 'మీసాల పిల్ల' పాట, విడుదలైన క్షణం నుంచే మ్యూజిక్ లవర్స్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ పాటలో చిరంజీవి చూపించిన సిగ్నేచర్ గ్రేస్, కొంటెతనం, ప్లేఫుల్ యాటిట్యూడ్.. ఫ్యాన్స్‌కు నిజంగా ఒక విజువల్ ట్రీట్. చాలా కాలం తర్వాత బాస్‌లోని ఆ ఈజ్‌ను చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. వరుసగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మరింత ట్రెండ్ చేస్తున్నారు.
మొదట్లో కొందరు ఇది క్రింజ్ లాగా ఉందని అన్నారు, కానీ మెల్లగా ఫ్యామిలి ఆడియెన్స్ కు కనెక్ట్ కావడంతో సాంగ్ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ఈ సాంగ్ మరో సాలిడ్ మైల్‌స్టోన్‌ను క్రాస్ చేసింది. యూట్యూబ్‌లో ఏకంగా 25 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇది కేవలం నంబర్ మాత్రమే కాదు, ఈ పాట ఎంతలా జనాల్లోకి వెళ్లిందో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ.
ప్రతీ చోటా ఈ పాటే వినిపిస్తూ, సోషల్ మీడియా రీల్స్‌లో ట్రెండ్ అవుతోంది. కేవలం వ్యూస్ మాత్రమే కాదు, ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ ఇండియా మ్యూజిక్ కేటగిరీలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఒక రీజినల్ సినిమా పాట దేశవ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవ్వడం, చూస్తుంటే బాస్ మేనియా ఏ లెవెల్లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ పాటలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో అందించిన క్యాచీ ట్యూన్, మెలోడీ ఈ సక్సెస్‌కు మరో కారణం.
అలాగే ఉదిత్ నారాయణ వాయిస్ కూడా పాటకు మరింత క్రేజ్ తెచ్చిందని చెప్పవచ్చు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఒక్క పాటకే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే, ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. 2026 సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం, ఒక పక్కా ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఈ మ్యూజికల్ సెన్సేషన్ హింట్ ఇస్తోంది. ఇక నెక్స్ట్ రాబోయే సాంగ్స్ టీజర్ కూడా ఇదే రేంజ్ లో ఆకట్టుకుంటాయో లేదో చూడాలి.
