అప్పుడు వెంకీతో.. ఇప్పుడు చిరూతో!
రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ డేట్ ను రివీల్ చేయాలని చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా, అందులో అనిల్ రావిపూడి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడారు.
By: Sravani Lakshmi Srungarapu | 14 Dec 2025 1:43 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు
మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజవుతుందని ముందునుంచే మేకర్స్ చెప్తున్నప్పటికీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ డేట్ ను రివీల్ చేయాలని చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా, అందులో అనిల్ రావిపూడి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడారు.
చిరంజీవి అప్డేటెడ్ వెర్షన్ చూస్తారు
జనవరి 12న మన శంకరవరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానుందని, చిరంజీవిలో ఉన్న ఫన్ టైమింగ్ ను ఓ జెనరేషన్ ఇప్పటికే చూసేసిందని, ఈ జెనరేషన్ కు అప్డేటెడ్ వెర్షన్ తో చిరంజీవి మీ ముందుకు తీసుకురాబోతున్నానని, ఇందులో ఉండే కామెడీ టైమింగ్స్, ఫైట్స్, డ్యాన్సులు అన్నీ ఆడియన్స్ ను తప్పక ఆదరిస్తాయని అనిల్ చెప్పారు.
సంక్రాంతికి వస్తున్నాం కంటే డెప్త్ గా ఉంటుంది
తన గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కంటే ఈ సినిమా కథలో కొంచెం డెప్త్ ఉంటుందని, మన శంకరవరప్రసాద్ గారు లో ఫన్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా కూడా ఉంటాయని చెప్పారు. ఈ మూవీలో చిరంజీవి ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించనున్నారని, వారితో వచ్చే సీన్స్, చిరూ- నయన్ మధ్య ఎమోషన్స్ చాలా బాగా వర్కవుట్ అయ్యాయని అనిల్ చెప్పారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేష్ ను నలుగురు పిల్లల తండ్రిగా చూపించి హిట్ అందుకున్న అనిల్, ఈసారి చిరూని ఇద్దరు పిల్లల తండ్రిగా చూపించి మరో హిట్ అందుకోవడానికి రెడీ అయ్యారన్నమాట.
