బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మ్యాజిక్.. 15 రోజుల్లోనే సరికొత్త రికార్డు!
ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయి.
By: M Prashanth | 27 Jan 2026 3:21 PM ISTసంక్రాంతి రేసులో నిలిచిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ మాస్ పవర్‌తో థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు పర్ఫెక్ట్ పండుగ ట్రీట్ అందించింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయి.
ఈ సక్సెస్ జోష్‌లో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడికి ఒక ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా.. అనిల్ రావిపూడి చిరంజీవిని చూపించిన విధానం మెగా ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. గతంలో కూడా వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ మెగా మూమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సక్సెస్‌ను ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే టీమ్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో అర్థమవుతోంది.
అసలు విషయానికొస్తే.. 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 358 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీజినల్ మార్కెట్‌లో ఒక సినిమా ఈ రేంజ్ వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈ నంబర్స్ చూస్తుంటే మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి క్లియర్ గా అర్థమవుతోంది.
అనిల్ రావిపూడి మార్క్ కామెడీ.. చిరంజీవి ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ గా మారాయి. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేయడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ఏమాత్రం జోరు తగ్గకుండా ఈ చిత్రం దూసుకుపోతోంది.
మూడో వారంలో కూడా చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండటం విశేషం. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. నేటి జనరేషన్ ఆడియన్స్ కి నచ్చేలా కంటెంట్ ఉండటమే ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణం. గతంలో చిరంజీవి చేసిన బ్లాక్ బస్టర్ల రికార్డులను ఈ సినిమా ఈజీగా క్రాస్ చేసేలా ఉంది. విజువల్స్.. మ్యూజిక్ కూడా సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.
ఒక రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. వసూళ్ల విషయంలో ఎక్కడా తగ్గకుండా రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఏదేమైనా 15 రోజుల్లోనే 358 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. అనిల్ రావిపూడి టేకింగ్.. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
