శంకరవరప్రసాద్ గారి కోసం స్పెషల్ సెట్
మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. చిరూ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 23 Aug 2025 1:51 PM ISTమెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. చిరూ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి విశ్వంభర కాగా ఇంకోటి మన శంకరవరప్రసాద్ గారు. ఈ రెండు సినిమాల్లో విశ్వంభర వచ్చే ఏడాది సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు రానుండగా, మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కానుంది.
మన శంకరవరప్రసాద్ గారు గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్
రీసెంట్ గా చిరూ బర్త్ డే సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్స్ రాగా, ఇప్పుడందరి దృష్టి ముందుగా రానున్న మన శంకరవరప్రసాద్ సినిమాపైనే ఉంది. టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే చిరూను అనిల్ ప్రెజెంట్ చేస్తున్నారని రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది.
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా..
అయితే అనిల్ సినిమాను ఎంత వేగంగా పూర్తి చేస్తారనేది అందరికీ తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమాలను వేగంగా పూర్తి చేస్తాడనే పేరు అనిల్ కు ఉంది. అయితే ఈ సినిమా విషయంలో అనిల్ తన వేగాన్ని ఇంకాస్త పెంచారు. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమాకు సంబంధించి 20రోజుల కొత్త షెడ్యూల్ మొదలవుతుందని, దాని కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ స్పెషల్ సెట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ లో జరిగే షెడ్యూల్ లో వెంకటేష్ కూడా జాయిన్ అవుతారని, ఆ షెడ్యూల్ లో చిరూ, వెంకీ, నయనతారపై కొన్ని సీన్స్ ను తీయనున్నారని, చిరూ, వెంకీ కలయికలో ఓ సాంగ్ ను కూడా అనిల్ ప్లాన్ చేశారని సమాచారం వినిపిస్తుంది.
