Begin typing your search above and press return to search.

కరెక్ట్ టైమ్ లో తగ్గిన వరప్రసాద్!

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ దగ్గర తన జోరు కొనసాగిస్తోంది.

By:  M Prashanth   |   22 Jan 2026 1:33 PM IST
కరెక్ట్ టైమ్ లో తగ్గిన వరప్రసాద్!
X

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ దగ్గర తన జోరు కొనసాగిస్తోంది. జెట్ స్పీడ్ లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసిన మెగాస్టార్ మొదటిసారి బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల మార్క్ ని దాటేశాడు. అనిల్ రావిపూడికి కూడా ఇది కెరీర్ బెస్ట్ హిట్ గా నిలుస్తోంది. మరొక హైలెట్ ఏమిటంటే.. రీజినల్ లాంగ్వేజ్ లో అత్యధిక షేర్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా MSG నిలవనుంది.





పండగ సెలవుల్లో ఇప్పటికే మెజారిటీ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను చూసేశారు. అయితే ఈ రన్‌ను మరింత లాంగ్ టర్మ్ కొనసాగించేలా మేకర్స్ ఒక ప్రాక్టికల్ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని థియేటర్లలో ఈ సినిమాకు రెగ్యులర్ టికెట్ ధరలనే వర్తింపజేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

ఈ నిర్ణయం ముఖ్యంగా మిడిల్ క్లాస్, ఆర్థికంగా ఇంకాస్త తక్కువ స్థాయిలో ఉండే సామాన్య ప్రేక్షకులకు బాగా ప్లస్ అవుతుంది. పండగ రద్దీ, అదనపు ధరల వల్ల ఇప్పటివరకు వెయిట్ చేసిన వారు, ఇప్పుడు నార్మల్ రేట్లకే మెగాస్టార్ వింటేజ్ కామెడీని ఎంజాయ్ చేసే ఛాన్స్ దక్కింది. థియేటర్లకు వచ్చే సామాన్య జనం పెరిగితే సినిమా లాంగ్ రన్ కు తిరుగుండదు.

ఈ రోజు జనవరి 22, గురువారం కావడంతో వీకెండ్ అడ్వాంటేజ్ తో ఈ కొత్త ధరలు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపు శుక్రవారం నుంచి మొదలయ్యే వీకెండ్ అడ్వాంటేజ్ ఈ సినిమాకు గట్టిగా కలిసొచ్చే అవకాశం ఉంది. తక్కువ ధరలో సినిమా అందుబాటులో ఉండటం వల్ల ఫ్యామిలీస్ మళ్ళీ థియేటర్ల వైపు చూసే అవకాశం కనిపిస్తోంది.

అంతేకాకుండా, ఈ వీకెండ్ ముగిసిన వెంటనే జనవరి 26న రిపబ్లిక్ డే హాలిడే రాబోతోంది. ఇది సినిమాకు ఒక పెద్ద బోనస్ అని చెప్పాలి. వరుసగా సెలవులు రావడం, దానికి తోడు టికెట్ రేట్లు తగ్గడం వంటి అంశాలు 'మన శంకరవరప్రసాద్ గారు' కలెక్షన్లను మూడో వారంలో కూడా స్టడీగా ఉంచేలా ఉన్నాయి. బాక్సాఫీస్ రన్ ను పెంచడానికి ఇది పక్కా టైమింగ్‌తో కూడిన ప్లాన్. పండగ తర్వాత కూడా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేలా వరప్రసాద్ టీమ్ మంచి గ్రౌండ్ వర్క్ చేస్తోంది. రిపబ్లిక్ డే వరకు ఈ క్రేజ్ ఇలాగే కొనసాగితే, చిరంజీవి ఖాతాలో మరో సాలిడ్ వసూళ్ల రికార్డు చేరినట్లే.