Begin typing your search above and press return to search.

మెగా ఫీస్ట్ కి సిద్ధంగా ఉన్నారా..?

ఇక నెక్స్ట్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   4 Nov 2025 5:32 PM IST
మెగా ఫీస్ట్ కి సిద్ధంగా ఉన్నారా..?
X

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు నుంచి ఫస్ట్ సాంగ్ గా మీసాల పిల్ల రిలీజైంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎం.ఎస్.వి.జి సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తుండగా రిలీజైన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎలా అయితే గోదారి గట్టుమీద సాంగ్ ఎలా సక్సెస్ అయ్యిందో మన శంకర వర ప్రసాద్ గారు కి ఈ సాంగ్ అంత బూస్టింగ్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది.

చిరంజీవి సోలో సాంగ్,,

ఈ సాంగ్ చిరంజీవి సోలో సాంగ్ గా వస్తుందని టాక్. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సాంగ్ నెక్స్ట్ రిలీజ్ చేయబోతున్నారట. భీమ్స్ మ్యూజిక్ కి మెగాస్టార్ స్టెప్పులు అదిరిపోతాయని అంటున్నారు. చిరు సోలో సాంగ్ కు ఉన్న క్రేజ్ తెలిసిందే. అందుకే ఈ సాంగ్ ని భీమ్స్ చాలా స్పెషల్ గా ప్లాన్ చేశాడట. ఇక ఈ సాంగ్ తర్వాత చిరంజీవి వెంకటేష్ కాంబో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట.

మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక స్పెషల్ క్యామియో ఇస్తున్నారని తెలిసిందే. ఈ సినిమాలో చిరు, వెంకటేష్ కాంబినేషన్ సీన్స్ సినీ లవర్స్ కి ఐ ఫీస్ట్ అందిస్తాయని అంటున్నారు. అంతేకాదు ఈ ఇద్దరి మధ్య ఒక సాంగ్ కూడా పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిసి చేసే సాంగ్ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్..

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ నటించడం అటు విక్టరీ ఫ్యాన్స్ కి కూడా ఫుల్ జోష్ అందిస్తుంది. 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారుతో మెగా హిట్ టార్గెట్ గా పెట్టుకున్నారు చిరంజీవి.

అనిల్ రావిపూడి పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్ని హిట్ సినిమాలే చేశాడు. మరి మెగాస్టార్ తో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. చిరంజీవి కూడా ఈ సినిమా వర్క్ ని అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేస్తున్నారట. మెగా స్టార్ విశ్వంభర సినిమా అసలైతే ముందు రిలీజ్ కావాల్సి ఉన్నా కూడా అనిల్ రావిపూడి సినిమా త్వరగా పూర్తవడంతో సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. విశ్వంభర, మన శంకర వరప్రసాద్ గారు తర్వాత చిరంజీవి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడని తెలిసిందే. నాని నిర్మాతగా యునానిమస్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది.