Begin typing your search above and press return to search.

మ‌రో నెల రోజుల్లో ముగింపేనా?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` తెరకెక్కుతోన్న‌ సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   24 Oct 2025 8:00 PM IST
మ‌రో నెల రోజుల్లో ముగింపేనా?
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు' తెరకెక్కుతోన్న‌ సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల క్రిత‌మే విక్ట‌రీ వెంక‌టేష్ కూడా టీమ్ తో జాయిన్ అయ్యారు. ప్ర‌స్తుతం చిరంజీవి-వెంక‌టేష్ మ‌ధ్య కాంబినేష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. మ‌రి ఈ సినిమా షూటింగ్ ఎంత వ‌ర‌కూ పూర్త‌యింది? ఎప్ప‌టికీ చిత్రీర‌క‌ర‌ణ పూర్తువుతుంది? అంటే ఆస‌క్తిక‌ర విష‌యం తెలిసింది. ఇప్ప‌టికే 65 శాతం షూటింగ్ పూర్త‌యిందిట‌. మిగిలిన 35 శాతం 30-45 రోజుల మ‌ధ్యలో పూర్త‌వుతుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి తెలిసింది.

వేగంలో పూరిని అందుకునేలా:

షూటింగ్ మొదలైన నాటి నుంచి పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా ప‌నిచేయ‌డంతోనే ఇంత వేగంగా పూర్త‌వుతుంద‌ని తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేయ‌డంలో అనీల్ వెరీ స్పీడ్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న షూటింగ్ మొద‌ల పెట్ట‌నంత వ‌ర‌కే. ఒక‌సారి సెట్స్ కు వెళ్లిన త‌ర్వాత గ్యాప్ లేకుండా ప‌ని చేయించుకోడం అనీల్ కు బాగా తెలుసు. టీమ్ ను ప‌రుగులు పెట్టిస్తాడు. ఈ విష‌యంలో అనీల్ పూర్తిగా డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాద్ నే ఫాలో అవుతున్నాడు. అందుకే అనీల్ ఏ సినిమా మొద‌లు పెట్టిన రిలీజ్ కు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు.

చేతిలో ఉన్న‌ది 60 రోజులే:

చ‌కాచ‌కా షూటింగ్త‌పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ మొదలు పెట్టి ప్ర‌క‌టించిన తేదీకే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీస‌కొస్తాడు. ఈ విష‌యంలో పూరి అయినా డిలే చేస్తాడేమో గానీ అనీల్ మాత్రం అందుకు ఛాన్స్ తీసుకోడు. మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు కూడా అలాగే జ‌రుగుతుంది. అంటే అక్టోబ‌ర్ ముగింపు లేదా న‌వంబ‌ర్ నుంచి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ లోగా టాకీ స‌హా పాట‌ల చిత్రీక‌ర‌ణ ముగించాల్సి ఉంటుంది. జ‌న‌వ‌రిలో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లోనూ అనీల్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది.

వాట్ నెక్స్ట్ అనీల్:

కొరియోగ్రాఫ‌ర్ ఉన్నా? త‌న కంటెంట్ ఎక్క‌డా డీవియేట్ కాకుండా పాట‌లుండాలి అన్న‌ది అనీల్ కండీష‌న్. అందుకు లోబడే మాస్ట‌ర్లు కూడా అనీల్ కోరుకున్న విధంగా ఔట్ పుట్ ఇస్తుంటారు. ఇంకా అనీల్ చేతిలో 60 రోజుల‌కు పైగా స‌మ‌యం ఉంది. ఈ లోగా అన్ని ర‌కాల పనులు పూర్తి చేసి శంక‌ర‌వ‌ర ప్ర‌సాద్ ని సిద్దం చేయాలి. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత అనీల్ ఏ హీరోతో సినిమా చేస్తాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.