బాస్ సాంగ్ ప్రోమో.. సోషల్ మీడియా షేక్..!
మెగా బాస్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతుంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా వస్తుంది.
By: Ramesh Boddu | 3 Oct 2025 2:43 PM ISTమెగా బాస్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతుంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలోని తొలి సాంగ్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో ఫస్ట్ సాంగ్ గా మీసాల పిల్ల ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమో సాంగ్ కే ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఉదిత్ నారాయణ చిరంజీవి కాంబో..
మెగా బాస్ సాంగ్ వస్తే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే అనేలా మన శంకర వరప్రసాద్ సాంగ్ హంగామా చేస్తుంది. ఈ సాంగ్ లో మరో సర్ ప్రైజింగ్ థింగ్ ఏంటంటే స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ ఈ సాంగ్ పాడారు. ఉదిత్ నారాయణ చిరంజీవి కాంబో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఉదిత్ నారాయణ పాటకి మెగాస్టార్ స్టెప్పులు మెగా ఫ్యాన్స్ కి మస్త్ జబర్దస్త్ జోష్ అందిస్తాయి. మన శంకర్ వరప్రసాద్ నుంచి రిలీజైన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇక ఈ సాంగ్ ప్రోమో కన్నా ముందు అనిల్ రావిపూడి ఉదిత్ నారాయణతో చేసిన ఒక కామెడీ వీడియో కూడా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. సినిమా తీయడం ఒక ఎత్తైతే ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడిని మించిన వారు లేరనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి భీంస్ సెసిరోలియో ఈ కాంబో కచ్చితంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేలా ఉంది.
చిరు బర్త్ డే శంకర వరప్రసాద్ టీజర్..
ఆమధ్య చిరు బర్త్ డే కోసం మన శంకర వరప్రసాద్ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ వచ్చింది. అది చూసి మెగా ఫ్యాన్స్ అంతా సూపర్ అనేశారు. ఇక సంక్రాంతికి మెగాస్టార్ సినిమా తప్పకుండా సూపర్ హిట్ కొట్టేస్తుందని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.
భోళా శంకర్ తర్వాత చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా వస్తుంది. ఐతే ఆ తర్వాత సెట్స్ మీదకు వెళ్లిన మన శంకర వర ప్రసాద్ ముందు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు భీమ్స్ అందిస్తున్న మ్యూజిక్ కి ఇంప్రెస్ అయిన చిరంజీవి విశ్వంభర లో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతికి వస్తే.. విశ్వంభర సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు.
