మన శంకర వరప్రసాద్.. సంక్రాంతికి అడ్వాంటేజ్ ఎంత?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 14 Dec 2025 9:31 AM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు.

అదే సమయంలో ఇప్పటికే ప్రమోషన్స్ మేకర్స్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. సాంగ్స్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా మెప్పించాయి. ఏదేమైనా సినిమాపై ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. చిరు- రావిపూడి కాంబినేషన్ క్లిక్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు.
అయితే ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మేకర్స్.. సంక్రాంతి సీజన్ ను ఫుల్ క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. రీసెంట్ గా ప్రకటించిన రిలీజ్ డేట్ ను చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. జనవరి 12వ తేదీన వరల్డ్ వైడ్ గా సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. స్పెషల్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ప్రకటించారు.
సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీన కాగా.. అక్కడికి రెండు రోజుల ముందు మన శంకర వరప్రసాద్ గారు మూవీ థియేటర్స్ లోకి రానుంది. జనవరి 12వ తేదీ సోమవారం కాగా.. ఆ రోజే విడుదల అవ్వనుంది. అంటే ఏడు రోజుల లాంగ్ వీకెండ్ మూవీకి కలిసి వస్తుంది. దీంతో మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు మంచి అడ్వాంటేజ్ దొరకనున్నట్లు తెలుస్తోంది.
దానికితోడు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్కడి రెండు రోజులకు చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీ వస్తుండడంతో సెలవులు కూడా కలిసి రానున్నాయి. ఏదేమైనా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న మన శంకరవరప్రసాద్ గారు మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ మామూలు ప్లాన్ వేయలేదని చెప్పాలి.
ఇక సినిమా విషయానికొస్తే.. చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్నారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కేథరిన్ ట్రెసా, వీటీవీ గణేషన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.
