Begin typing your search above and press return to search.

పడవలో పంచెకట్టుతో 'మన శంకర వరప్రసాద్ గారు'

కొత్త పోస్టర్‌లో చిరంజీవి సాంప్రదాయ లుక్‌లో కనిపిస్తున్నారు.

By:  M Prashanth   |   27 Aug 2025 1:37 PM IST
పడవలో పంచెకట్టుతో మన శంకర వరప్రసాద్ గారు
X

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే ప్రేక్షకులకి ఎప్పుడూ కూడా ఓ ప్రత్యేకమైన వేడుక. ఆయన స్టైల్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కి అభిమానులు ఫిదా అవుతారు. ఇప్పుడు ఓ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఫ్యామిలీ టచ్‌ కూడా జోడించి పండగ వాతావరణాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ కొత్త సినిమా ఈ మధ్యే టైటిల్ గ్లింప్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు స్పెషల్ పోస్టర్ తో కూడా కిక్కిస్తోంది.


చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా “మన శంకర వర ప్రసాద్ గారు” అనే టైటిల్‌తో మేకర్స్ అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఆయన అసలు పేరును టైటిల్‌గా పెట్టడం అభిమానుల్లో ప్రత్యేకమైన కనెక్ట్‌ను తెచ్చింది. “పండగకి వస్తున్నారు” అనే ట్యాగ్‌లైన్ కూడా సినిమా ఫెస్టివ్ మూడ్‌ను బలంగా సెట్ చేసింది. ఇప్పుడు వినాయకచవితి సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ కూడా అచ్చం ఆ పండగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.

కొత్త పోస్టర్‌లో చిరంజీవి సాంప్రదాయ లుక్‌లో కనిపిస్తున్నారు. వైట్ గోల్డ్ పంచె, జుబ్బా వేసుకుని పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో అలంకరించబడిన పడవపై నిలబడి ఉన్న ఆయన లుక్ మాస్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా ఉంది. ప్రత్యేకంగా పోస్టర్‌లోని కలర్ టోన్, వాతావరణం, చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ అన్ని కలిసి సినిమా పట్ల అంచనాలను మరింతగా పెంచేశాయి.

ఈ సినిమాను సాహు గరపాటి, సుష్మిత కొణిదెల గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సినిమాకు ఫన్, మాస్, ఫ్యామిలీ ఎమోషన్ అన్నీ మిక్స్ గా ఉండబోతున్నాయని టాక్. టైటిల్ గ్లింప్స్‌లోనే చిరంజీవి వింటేజ్ స్టైల్, ఆయన స్వాగ్‌ని తిరిగి చూపించిన అనిల్ రావిపూడి, ఇప్పుడు పోస్టర్‌తో మరోసారి ఫెస్టివ్ ఫీలింగ్‌ను కలిగించారు.

ఇక సంక్రాంతి 2026కి సినిమా రిలీజ్ కానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మాస్ ఫెస్టివల్ టైమ్‌లో మెగాస్టార్ సినిమా రావడం అభిమానులకి ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆనందం. థియేటర్లలో పెద్ద జాతరలా మారేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.