Begin typing your search above and press return to search.

'మన శంకరవరప్రసాద్ గారు'.. లేటెస్ట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..

నిన్న రెండవ శనివారం 13వ రోజు నాడు బుక్‌మైషో ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా 101.79కే టికెట్లు అమ్ముడవ్వడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By:  M Prashanth   |   25 Jan 2026 12:04 PM IST
మన శంకరవరప్రసాద్ గారు.. లేటెస్ట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..
X

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన వింటేజ్ మాస్‌ను మరోసారి చూపిస్తున్నారు. సంక్రాంతి సీజన్ ముగిసినా.. రిలీజ్ అయ్యి రెండు వారాలు గడుస్తున్నా 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా జోరు అస్సలు తగ్గడం లేదు. ఈ రోజు ఆదివారం సెలవు రోజున థియేటర్ల దగ్గర సందడి ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో మెగాస్టార్‌ను ప్రెజెంట్ చేసిన తీరు నేటి జనరేషన్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. వినోదానికి ఇంపార్టెన్స్ ఇస్తూనే.. చిరంజీవిలోని వింటేజ్ గ్రేస్‌ను అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద అసెట్ అయ్యింది. థియేటర్లలో ఈ సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. బాక్సాఫీస్ దగ్గర మెగా ర్యాంపేజ్ ఇంకా కొన్ని రోజులు కొనసాగేలా కనిపిస్తోంది.

నిన్న రెండవ శనివారం 13వ రోజు నాడు బుక్‌మైషో ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా 101.79కే టికెట్లు అమ్ముడవ్వడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్ అయ్యి 12 రోజులు దాటిన తర్వాత కూడా ఈ రేంజ్ లో బుకింగ్స్ రావడం మెగాస్టార్ స్టామినాకు నిదర్శనం. వీక్ డేస్ తో పోలిస్తే వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగినట్లు సమాచారం.

ఈ చిత్రం ఇప్పటికే కొత్త ఇండస్ట్రీ హిట్ గా అవతరించి పాత రికార్డులను తిరగరాస్తోంది. అనిల్ రావిపూడి ఎగ్జిక్యూషన్.. సాలిడ్ రైటింగ్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వల్ల వీకెండ్స్ లో ఫ్యామిలీస్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఆల్ టైమ్ టాప్ తెలుగు సినిమాల లిస్టులోకి వెళ్లడానికి రెడీ అవుతోంది. సాహు గారపాటి.. సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా నిర్మించారు.

భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ఒక రేంజ్ లో హెల్ప్ అయింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే.. కంటెంట్ బాగుంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ అయినా క్రియేట్ చేయవచ్చని మెగాస్టార్ మరోసారి ప్రూవ్ చేశారు. ఏదేమైనా 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ఒక మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నేటి ఆదివారం బుకింగ్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండటంతో.. వీకెండ్ ముగిసే సమయానికి మరిన్ని కొత్త రికార్డులు వెలువడే అవకాశం ఉంది. మెగాస్టార్ నెక్స్ట్ మూవీ 'విశ్వంభర' కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ సినిమా రిజల్ట్ ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి.