Begin typing your search above and press return to search.

చిరు న్యూ లుక్.. బరువు తగ్గారా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   8 Oct 2025 5:51 PM IST
చిరు న్యూ లుక్.. బరువు తగ్గారా?
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. రోజురోజుకు మరింత యంగ్ గా మారిపోతున్న చిరు.. తాజాగా కొత్త ఫోటో షూట్ తో మరోసారి వార్తల్లో నిలిచారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ తో మెగాస్టార్.. వింటేజ్ డేస్ ను గుర్తుకు తెచ్చారని చెప్పాలి.


బ్లాక్ గ్లాసెస్ ధరించిన చిరు.. సూట్, బూట్ తో అందరినీ ఆకట్టుకున్నారు. మరో పిక్ లో క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ అవుట్ ఫిట్ తో ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. తన హెయిర్ స్టైల్ ను కంప్లీట్ గా మార్చిన ఆయన.. తన స్వాగ్ తో మెప్పింటారు. క్లాసీ లుక్ కు మెగా ఫ్లేవర్ యాడ్ చేసి అదరగొట్టారు. 70స్ లో 30స్ యువకుడిగా కనిపిస్తూ ఫీస్ట్ ఇచ్చారని చెప్పాలి.


దీంతో చిరు కొత్త ఫోటో షూట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తున్నాయి. అదే సమయంలో కొత్త చర్చకు కూడా దారి తీశాయి. 70 ఏళ్ల ఏజ్ లో చిరు.. కొత్త దశకు సిద్ధంగా ఉన్నారనే సందేశాన్ని పంపుతున్నట్లు అనిపిస్తోంది. అయితే ఇప్పుడు చిరంజీవి బరువు తగినట్లు కూడా అనిపిస్తోంది.


సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిరు.. ఇప్పుడు రోల్స్ డిమాండ్ కోసం వెయిట్ తగ్గినట్టు ఉన్నారని అనేక మంది సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. వరుసగా వర్కౌట్స్ తో ఫిట్ గా కనిపిస్తున్నారని అంటున్నారు. తన స్వాగ్ తో ఇప్పటికీ ఆడియన్స్ ను అలరించాలనే ఉద్దేశంతో ఉన్నారని చెబుతున్నారు.

అయితే చిరంజీవి.. త్వరలో మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీ అప్డేట్స్ లో ఇప్పటికే చిరు.. ఎవర్ గ్రీన్ గా కనిపించారు.

అదే సమయంలో వచ్చే ఏడాది సమ్మర్ లో విశ్వంభర మూవీతో సందడి చేయనున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవడం వల్ల 2026 వేసవికి వాయిదా పడింది. అందులో కూడా చిరు వింటేజ్ లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. మరి తన అప్ కమింగ్ మూవీస్ లో మెగాస్టార్.. ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ ఇచ్చేలా మాత్రం ఉన్నారు.