Begin typing your search above and press return to search.

యాడ్స్ వరకేనా.. సినిమా ఏమైనా చేస్తారా?

సాధారణంగా కొన్ని కాంబినేషన్లు మంచి విజయాన్ని అందుకుంటే.. మరికొన్ని కాంబినేషన్లు ఎప్పుడు సెట్ అవుతాయా అని అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు.

By:  Madhu Reddy   |   20 Dec 2025 5:00 AM IST
యాడ్స్ వరకేనా.. సినిమా ఏమైనా చేస్తారా?
X

సాధారణంగా కొన్ని కాంబినేషన్లు మంచి విజయాన్ని అందుకుంటే.. మరికొన్ని కాంబినేషన్లు ఎప్పుడు సెట్ అవుతాయా అని అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా అటు స్టార్ డైరెక్టర్.. ఇటు స్టార్ హీరో ఇద్దరు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఆ కాంబినేషన్లు ఎందుకో సెట్ అవ్వడానికి కుదరడం లేదు. కానీ ఆ కాంబినేషన్స్ లో యాడ్స్ వస్తే మాత్రం యాడ్స్ వరకేనా.. సినిమా చేసేదేమైనా ఉందా? అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు.మరి అలాంటి మోస్ట్ వెయిటింగ్ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి - కృష్ణవంశీ.




అసలు విషయంలోకి వెళ్తే.. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న దర్శకులలో కృష్ణవంశీ కూడా ఒకరు. ఇప్పటికే ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలు రొమాంటిక్, యాక్షన్ , కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అటు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 150 కి పైగా చిత్రాలలో నటించి తన నటనతో.. ఎనర్జిటిక్ లెవెల్స్ తో ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. కొత్త దర్శకులకు కూడా అవకాశాలిస్తూ ఏడుపదుల వయసులో కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

దీనికి తోడు ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా గతంలో చిరంజీవితో చేసిన థంప్స్ అప్ యాడ్ షూటింగ్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ ను షేర్ చేశాడు. ఇందులో చిరంజీవి చాలా బొద్దుగా కనిపించారు..అలా చిరంజీవితో కృష్ణవంశీ కలిసి పనిచేసిన ఈ యాడ్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావాలి అని కోరుకుంటున్నారు. కానీ ఇదివరకే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రంగమార్తాండ సినిమా ట్రైలర్ కి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు వీరిద్దరూ కాంబినేషన్లో సినిమా రాలేదు. మరి ఇప్పటికైనా ఈ కాంబినేషన్లో మూవీ వస్తుందేమో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. తనదైన నటనతో అందరినీ మెప్పించి సుప్రీం హీరోగా.. నేడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకొని.. బ్రేక్ డాన్స్ తో ఇండస్ట్రీకి సరికొత్త డాన్స్ మూమెంట్స్ ని పరిచయం చేసి.. ఆడియన్స్ ను ఉర్రూతలూగించారు.. అలాంటి ఈయన ఇప్పుడు ఈ వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ఈయన ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అలాగే వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేశారు. షూటింగ్ కూడా పూర్తయింది. వచ్చే యేడాది సమ్మర్ సందర్భంగా రిలీజ్ కాబోతోంది.. అలాగే ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది చివరి నాటికి రిలీజ్ కానున్నట్లు సమాచారం