బాసూ 35 ఏళ్ల తర్వాతా అదే గ్రేసూ
రోజురోజుకు మెగాస్టార్ లోని యువకుడు బయటపడుతున్నాడు. దాదాపు 35 ఏళ్ల క్రితం రిలీజైన కొదమ సింహం లుక్ ఆయనలో ఇంకా ప్రతిబింబిస్తూనే ఉంది.
By: Sivaji Kontham | 20 Nov 2025 1:25 PM ISTరోజురోజుకు మెగాస్టార్ లోని యువకుడు బయటపడుతున్నాడు. దాదాపు 35 ఏళ్ల క్రితం రిలీజైన కొదమ సింహం లుక్ ఆయనలో ఇంకా ప్రతిబింబిస్తూనే ఉంది. ఇప్పటికీ అదే యవ్వనం.. అదే ఈజ్.. రూపంలోనే కాదు డ్యాన్సుల్లోను అదే గ్రేసు.. అందుకే ఎవర్ గ్రీన్ హీరోగా ఇప్పటికీ బాక్సాఫీస్ ని రూల్ చేస్తున్నారు చిరంజీవి.
60ప్లస్ లోను ఆయన ఏడాదికి మూడు సినిమాల్లో నటించేంతటి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, బాస్ ని వెండితెరపై వీక్షించేందుకు యూత్ ఎప్పుడూ క్రేజీగానే ఫీలవుతుంది. 2025లో ఆయన డైరీ ఫుల్. విశ్వంభర, మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాలతో బిజీగా ఉంటూనే మెగాస్టార్ 158 చిత్రం కోసం సన్నాహకాల్లో ఉన్నారు.
ఇలాంటి సమయంలో మెగా బాస్ చిరంజీవి నటించిన `కొదమ సింహం` చిత్రాన్ని 35 సంవత్సరాల తర్వాత రీరిలీజ్ చేస్తున్నారు. దీనికోసం 4కే రిజల్యూషన్ లో లుక్ ని కూడా ఇంప్రూవ్ చేసారు. నాటి సినిమా దృశ్యం, శబ్ధం ప్రతిదీ రీమోడల్ చేసి, నేటి అధునాతన వెర్షన్ లో తిరిగి అభిమానులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. 1990లో విడుదలైన సినిమా ఇప్పుడు కొత్త లుక్ ఎలా ఉందో చూడాలనే ఉత్సాహం, 35ఏళ్ల తర్వాత ఈ ప్రత్యేక క్షణం కోసం ఎదురు చూస్తున్న అభిమానులను ఎంతో ఎగ్జయిట్ చేస్తోంది.
`కొదమ సింహం` తెలుగు సినిమాలలో అత్యంత స్టైలిష్, పాత్ బ్రేకింగ్ చిత్రాలలో ఒకటి. కౌబోయ్ గా చిరంజీవి లుక్‌కి, నటనకు ప్రశంసలు కురిసాయి. ఆ రోజుల్లోనే ఇది ఎంతో అడ్వాన్స్ డ్ కెమెరా వర్క్ తో రూపొందింది. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. ఈ రేర్ మూవ్ మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. మెగాస్టార్ కొదమ సింహం చిత్రాన్ని సరికొత్త వెర్షన్ లో మరోసారి థియేటర్లలో వీక్షించాలని ఆసక్తిగా ఉన్నారు.
