సుబ్బరాజ్ తో చిరంజీవి మూవ్ అవుతున్నారా!
కానీ ఆ మాట వెనుక సీన్ ఇంకా ముందుకెళ్లిందన్నది తాజాగా అందుతోన్న సమాచారం. ఇప్పటికే ఇద్దరి మధ్య రెండున్నర గంటల పాటు కథా చర్చలు జరిగినట్లు తెలిసింది.
By: Srikanth Kontham | 14 Oct 2026 4:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి లైనప్స్ పై ఎన్నడు లేనంత జోరుగా చర్చలు సాగుతున్నాయి. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అన్నయ్య తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు యువ దర్శకుల పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే చిరంజీవితో పనిచేయాలన్న కార్తీక్ మనసులోని మాట బయటకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కార్తీక్ చేయాలని ఉందనే విషయాన్ని మాత్రమే చెప్పాడనుకున్నారంతా.
కానీ ఆ మాట వెనుక సీన్ ఇంకా ముందుకెళ్లిందన్నది తాజాగా అందుతోన్న సమాచారం. ఇప్పటికే ఇద్దరి మధ్య రెండున్నర గంటల పాటు కథా చర్చలు జరిగినట్లు తెలిసింది. ఇటీవల కార్తీక్ సుబ్బరాజ్ నేరుగా చిరంజీవిని కలిసి సరికొత్త కథను వినిపించినట్లు ఫిలింనగర్ వర్గాల నుంచి బలమైన లీకులు అందుకున్నాయి. రెండున్నర గంటలకు పైగా ఈ నరేషన్ సాగిందని అంటున్నారు. కార్తీక్ మార్క్ గ్యాంగ్‌స్టర్ .. యాక్షన్ డ్రామా జోనర్లో మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా స్క్రిప్ట్‌ను ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేసినట్లు సమాచారం.
సుబ్బరాజ్ చెప్పిన డిఫరెంట్ స్టైల్ నెరేషన్‌కు చిరంజీవి ఇంప్రెస్ అయినా? తుది నిర్ణయంపై ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి వరుస కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. దీంతో కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన స్క్రిప్ట్ హోల్డ్ లో ఉందనే ప్రచారం జరుగుతోంది. మెగా అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు సాధారణ కమర్శియల్ రొటీన్ చిత్రాల కంటే కార్తీక్ సుబ్బరాజ్ లాంటి దర్శకుడితో చిరంజీవి సినిమా చేస్తే ఆ వింటేజ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు.
సూపర్ రజినీకాంత్‌తో `పేట` లాంటి స్టైలిష్ అండ్ మాస్ ఎంటర్టైనర్ ఇచ్చిన కార్తీక్.. చిరంజీవిని ఏ స్థాయిలో చూపిస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ కాంబో గనుక సెట్స్ పైకి వెళ్తే మాత్రం ఆవైబ్ వేరే లెవల్లో ఉంటుంది. ఇప్పటి వరకు కథా చర్చల దశలోనే ఉన్న ప్రాజెక్ట్ త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిరంజీవి తదుపరి షెడ్యూల్స్ బట్టి దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ - చిరంజీవి కలయిక నిజంగానే తెరపైకి వస్తే టాలీవుడ్లో సరికొత్త సంచలనం అవుతుంది.
