అప్పుడు నాగార్జునతో.. ఇప్పుడు చిరంజీవితో నిజమేనా..?
ప్రేక్షకులను మెప్పించాలంటే క్రేజీ కాంబినేషన్ ఉండాల్సిందే అన్నట్టుగా కొందరు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
By: Ramesh Boddu | 27 Oct 2025 9:38 AM ISTప్రేక్షకులను మెప్పించాలంటే క్రేజీ కాంబినేషన్ ఉండాల్సిందే అన్నట్టుగా కొందరు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎవరు ఊహించని కాంబినేషన్ లో సినిమా వస్తే అది స్పెషల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరు హీరోలు కలిసి చేసే ప్రాజెక్ట్ లకు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్ కి తగినట్టుగా అన్నీ సెట్ రైట్ చేయాలని చూస్తారు. ఇప్పటికే తెలుగు తెర మీద క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి.. వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో మరో స్టార్ కాంబో సెట్ అవబోతుందని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్ లో సినిమా..
అది కూడా ఈసారి మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటారని టాక్. చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాలో ఆల్రెడీ వెంకటేష్ క్యామియో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ బాబీ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా మెగా మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటిస్తాడన్న టాక్ వినిపిస్తుంది.
తమిళ్ హీరోనే అయినా తెలుగులో కూడా కార్తి సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. కార్తి ప్రతి సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. సూర్య తర్వాత తమ్ముడు కార్తి కూడా తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇన్ ఫ్యాక్ట్ ఇంకా నిజం చెప్పాలంటే కార్తి తెలుగు మాట్లాడే తీరు చూసి అతను తెలుగు హీరోనే అనుకుంటారు. ఐతే ఆల్రెడీ కార్తి తెలుగులో ఊపిరి సినిమా చేశాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున కూడా నటించారు.
కార్తి ఓకే చేశాడంటే అది కచ్చితంగా బలమైన పాత్ర..
2016లో రిలీజైన ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఐతే మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కార్తి నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. చిరుతో స్క్రీన్ షేరింగ్ అంటే ఎవరు కాదంటారు. కానీ కార్తి ఓకే చేశాడంటే అది కచ్చితంగా బలమైన పాత్ర అయ్యుండాలి. మరి నాగార్జునతో కలిసి నటించిన కార్తి ఇప్పుడు చిరంజీవితో కూడా చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. కార్తి చేస్తున్నాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా తమిళంలో కూడా రిలీజ్ అవుతుందేమో చూడాలి.
చిరంజీవితో వాళ్తేరు వీరయ్య సినిమా చేసిన బాబీ ఈసారి మెగా మాస్ ఎంటర్టైనర్ తో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందని తెలుస్తుంది.
కార్తి కూడా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలన్న ఆసక్తి ఉన్నా కూడా సరైన ఛాన్స్ లు రావట్లేదు. ఐతే హిట్ ఫ్రాంచైజీ లో భాగంగా హిట్ 4 లో కార్తి ఉంటాడని తెలుస్తుంది. ఆల్రెడీ హిట్ 3లో కార్తి క్యామియో సర్ ప్రైజ్ చేసింది. హిట్ 4 కన్నా ముందే చిరంజీవితో సినిమా ఓకే అయితే మాత్రం అదుర్స్ అని చెప్పొచ్చు.
