Begin typing your search above and press return to search.

'కాకా' ఈసారి ఏం లీక్ చేశారంటే?

చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కుతున్న సినిమానే కాకా. వాల్తేరు వీరయ్య తర్వాత వారిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి.

By:  M Prashanth   |   20 Sept 2026 3:09 PM IST
కాకా ఈసారి ఏం లీక్ చేశారంటే?
X

మెగాస్టార్ చిరంజీవి నోట మాట వస్తే చాలు.. అది లీక్ అవుతుందా? లేక కావాలనే బయటకు వస్తుందా? అనేది ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది. ముఖ్యంగా కాకా మూవీ విషయంలో అదే జరుగుతోంది. ముందు టైటిల్ విషయంలో చిన్న క్లూ ఇచ్చి ఫ్యాన్స్‌ ను కన్ఫ్యూజ్ చేసిన చిరు.. ఇప్పుడు ఏకంగా తన క్యారెక్టర్ పేరునే రివీల్ చేశారు.

చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కుతున్న సినిమానే కాకా. వాల్తేరు వీరయ్య తర్వాత వారిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి. అయితే ఆ మూవీకి సంబంధించి టైటిల్ కంటే ముందే చిరు లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ సినిమా ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో చిరంజీవి మాట్లాడుతూ.. టైటిల్ ఇంకా కదిరి అనే ఉంచారా అని అడిగారు.

దీంతో సినిమా టైటిల్ లో కదిరి అనే పదం ఉండబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కొందరైతే కదిరి కాకాజీ అంటూ కూడా పోస్టులు పెట్టారు. కానీ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22వ తేదీన మేకర్స్ అసలు టైటిల్‌ ను ప్రకటించారు. అదే కాకా. టైటిల్ విషయంలో చిరంజీవి కావాలనే చిన్న లీక్ ఇచ్చి.. అసలు పేరును సీక్రెట్ గా ఉంచారనే చర్చ మొదలైంది.

ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తన రోల్ నేమ్ ను స్వయంగా బయటపెట్టడంతో చిరు లీక్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలో చిరంజీవి రోల్ పేరు కదిరి కాళిదాస్ అని చెప్పారు. దీనికి మరో షేడ్‌ గా సత్యం అనే పేరు కూడా ఉంది. బయటకు చూస్తే సాధారణంగా కనిపించే వ్యక్తి.. లోపల మాత్రం పూర్తిగా మరో మనిషి. సినిమాలో చిరంజీవి కె. సత్యం పేరుతో ఓ ఆక్వా ఫ్యాక్టరీలో సూపర్‌ వైజర్‌ గా కనిపించనున్నారు.

సత్యం లైఫ్ లో దాగి ఉన్న గతమే కథలో అసలు ట్విస్ట్‌ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణ సూపర్‌ వైజర్‌ గా కనిపించే వ్యక్తికి.. అండర్‌ వరల్డ్‌ లో పవర్‌ ఫుల్ వ్యక్తిగా పేరున్న కదిరి కాళిదాస్ కు ఉన్న సంబంధం ఏంటి? అసలు సత్యం క్యారెక్టర్ ఏంటి? అనేది సినిమాలో ఇంట్రెస్టింగ్ గా చూపించనున్నట్లు సమాచారం. ఇది కేవలం యాక్షన్‌ కే పరిమితం కాకుండా తండ్రీకూతుళ్ల రిలేషన్ కూడా కథలో స్ట్రాంగ్ గా చూపించనున్నట్లు తెలుస్తోంది.

మాలీవుడ్ బ్యూటీ అనస్వర రాజన్ చిరంజీవి కూతురు అమ్ములు పాప రోల్ లో నటిస్తోంది. ఆ ఎమోషనల్ ట్రాక్‌ కు యాక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బాబీ తనదైన మాస్ టచ్‌ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రియమణి, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు.