చిరు టైటిల్ లీక్.. అసలు కథేంటి?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా టైటిల్ పై ప్రెజెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒకేటే డిస్కషన్ నడుస్తోంది.
By: M Prashanth | 12 Aug 2026 9:56 AM ISTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా టైటిల్ పై ప్రెజెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒకేటే డిస్కషన్ నడుస్తోంది. రీసెంట్ గా ఒక కొరియన్ కనకరాజు ఈవెంట్ లో మాట్లాడుతూ టైటిల్ లీక్ చేశారు. చిరు లీక్స్ కొత్తేమీ కాదు. లేటెస్ట్ ట్రెండ్ లో ఆయన సరదాగా ఇలాంటి లీక్స్ వదులుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఆయన నోటి నుంచి 'కదిరి' అనే పదం బయటకు రావడంతో, ఫ్యాన్స్ లో స్పెక్యులేషన్స్ బాగా పెరిగిపోయాయి.
వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించి దాన్ని ఆపే ప్రయత్నం చేసినా, ఆ చిన్న పదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక 'కదిరి' అనగానే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఊరు అందరికీ గుర్తుకొస్తుంది. అయితే ఈ పేరుకు గా చాలా కథనాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఆ ప్రాంతానికి ఉన్న చరిత్ర మాత్రమే.
ఇక చిరంజీవి సినిమా టైటిల్ లో రాబోయే 'కదిరి' అనే పదానికి కథతో ఎలాంటి సంబంధం ఉందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇది ఒక స్పెసిఫిక్ లోకేషన్ కు సంబంధించిన రెఫరెన్సా, లేక సినిమాలో చిరంజీవి ప్లే చేసే క్యారెక్టర్ ఐడెంటిటీనా అనే సందేహాలు వస్తున్నాయి. లేదా ఆ పేరు వెనుక ఏదైనా పవర్ ఫుల్ సింబాలిక్ మీనింగ్ ఉందా అనేది మూవీ లవర్స్ ఆలోచన.
దర్శకుడు బాబీ కొల్లి గతంలో 'వాల్తేరు వీరయ్య' లో లోకేషన్ ఫ్లేవర్ ని హీరో క్యారెక్టర్ బ్రాండింగ్ తో మిక్స్ చేసి చూపించారు. ఆ సెంటిమెంట్ తోనే ఈ కొత్త ప్రాజెక్ట్ కి కూడా అలాంటి మాస్ టైటిల్ డిజైన్ చేస్తున్నారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేంత వరకు ఈ విషయంలో ఒక క్లారిటీ రాదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, అనస్వర రాజన్, నివేథా పేతురాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సంక్రాంతికి ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో వస్తున్న బర్త్ డే అప్డేట్ పై అందరి ఫోకస్ పడింది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అఫీషియల్ టైటిల్ గ్లింప్స్ విడుదల కానుంది. ఆ టీజర్ బయటకు వస్తే కానీ 'కదిరి' అనేది మెగా158 ఫైనల్ టైటిల్ లో భాగమా కాదా, అసలు ఆ పేరు వెనుక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటనేది రివీల్ అవ్వదు. ఆలోపు వస్తున్న ఈ రూమర్స్ మాత్రం సినిమాపై బజ్ ను మరింత పెంచుతున్నాయి. ఇక మరోవైపు మెగాస్టార్ విశ్వంభర విడుదలకి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
