కాకా.. ఇప్పుడు 128 రోజుల రేసు!
చిరంజీవి, బాబీ కాంబినేషన్‌కు సంక్రాంతి కొత్త కాదు. 2023లో ‘వాల్తేరు వీరయ్య’ కూడా ఇదే సీజన్‌లో వచ్చింది. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మళ్లీ పండగ రిలీజ్‌కే వస్తున్నారు.
By: M Prashanth | 4 Sept 2026 5:13 PM ISTచిరంజీవి ‘కాకా’కు రిలీజ్ డేట్ విషయంలో ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2027 జనవరి 13న సంక్రాంతికి వస్తామని టైటిల్ గ్లింప్స్‌లోనే ప్రకటించారు. ఇప్పుడు సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో మరో లాంగ్ షెడ్యూల్ మొదలవుతోంది. కొత్త షెడ్యూల్ మొదలయ్యే రోజు నుంచి రిలీజ్ వరకు లెక్కేస్తే దాదాపు 128 రోజులే ఉన్నాయి.
చిరంజీవి, బాబీ కాంబినేషన్‌కు సంక్రాంతి కొత్త కాదు. 2023లో ‘వాల్తేరు వీరయ్య’ కూడా ఇదే సీజన్‌లో వచ్చింది. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మళ్లీ పండగ రిలీజ్‌కే వస్తున్నారు. కానీ ఈసారి చిరంజీవిని పూర్తిగా వేరే సెటప్‌లో చూపిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌లో రావులపాలెంలోని అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్‌లో సూపర్‌వైజర్ సత్యంగా పరిచయం చేశారు. అక్కడి నుంచి క్యారెక్టర్‌లో మరో షేడ్ కూడా ఉందనే హింట్ ఇచ్చారు. కథ ఏ దిశలో వెళ్తుందో మాత్రం ఇంకా బయటపెట్టలేదు.
సెప్టెంబర్ 7 నుంచి మొదలయ్యే షెడ్యూల్‌ను టీమ్ ఇంపార్టెంట్ అని చెబుతోంది. అంటే ఈ షెడ్యూల్‌లో కథకు సంబంధించిన పెద్ద భాగం పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. అనస్వర రాజన్, నివేతా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కూడా సినిమాలో ఉన్నారు. తమన్ మ్యూజిక్ చేస్తున్నారు. ఇప్పటివరకు టైటిల్ గ్లింప్స్‌తో హీరో క్యారెక్టర్‌ను మాత్రమే ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ షెడ్యూల్ తర్వాత కాస్టింగ్, పాటలు, మరో లుక్ పై క్లారిటీ రావచ్చు.
ఇక్కడ అసలు ఒత్తిడి రిలీజ్ డేట్ వల్లే పెరుగుతోంది. జనవరి మధ్యలో సినిమా థియేటర్లలో ఉండాలంటే షూటింగ్‌తో పాటు ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నడవాలి. లాంగ్ షెడ్యూల్ పూర్తయ్యాక ఇంకా ఎంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంటుందన్నది క్లియర్ అయితేనే జనవరి 13 డేట్ ఎంత కంఫర్ట్‌గా ఉందో అర్థమవుతుంది. బాబీ టీమ్ ఇప్పుడు అదే టైమ్‌లైన్‌ను పట్టుకుని ముందుకు వెళ్తోంది.
పైగా సంక్రాంతి విండో ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఇప్పటికే 2027 పండగ సీజన్ కోసం మరికొన్ని సినిమాలు కూడా తమ డేట్స్ ప్రకటించాయి. కాబట్టి ఒకసారి ఆలస్యం అయితే కొత్త రిలీజ్ విండో చూడటం అంత ఈజీ కాదు. ‘కాకా’ టీమ్ ముందుగానే డేట్ ప్రకటించడంతో ఇప్పుడు ప్రతి షెడ్యూల్‌కు టైమ్ లెక్క కూడా ఇంపార్టెంట్.
ఇక ‘కాకా’ తర్వాత కూడా చిరంజీవి లైనప్ ఖాళీగా లేదు. వశిష్ఠ దర్శకత్వంలో చేసిన ‘విశ్వంభర’ రిలీజ్ ఇంకా పెండింగ్‌లో ఉండగా, శ్రీకాంత్ ఓదెలతో సినిమా కూడా లైన్‌లో ఉంది. నాని సమర్పిస్తున్న ఆ ప్రాజెక్ట్ ఆగిపోలేదని శ్రీకాంత్ ఇటీవలే మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ‘ది ప్యారడైజ్’ పని పూర్తయ్యాక చిరుతో సినిమా మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్నానని కూడా చెప్పాడు. ది ప్యారడైజ్ తరువాత స్క్రిప్ట్ పనుల్లో బిజి కానున్న శ్రీకాంత్ ఆ సినిమాను వచ్చే ఏడాది స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
