Begin typing your search above and press return to search.

నైజాం కోటను లాక్ చేసిన 'కాకా'!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ దక్కించుకుంది. 2027 సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.

By:  M Prashanth   |   28 Nov 2026 10:04 PM IST
నైజాం కోటను లాక్ చేసిన కాకా!
X

సంక్రాంతి సీజన్ లో బాక్సాఫీస్ లెక్కలు తేలాలంటే నైజాం ఏరియాలో థియేటర్ల పట్టు చాలా ముఖ్యం. 2027 సంక్రాంతి బరిలో దిగుతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'కాకా' మేకర్స్ ఈ విషయంలో పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. సినిమా రిలీజ్ కు సరిగ్గా నెలన్నర రోజులు మాత్రమే సమయం ఉండటంతో, నైజాం థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.




టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ లో ఏషియన్ సురేష్ కాంబినేషన్ కు ఉన్న పట్టు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మల్టీప్లెక్సుల నుంచి సింగిల్ స్క్రీన్ల వరకు తెలంగాణ అంతటా వీళ్ల నెట్ వర్క్ బలంగా ఉంటుంది. సంక్రాంతి లాంటి పెద్ద సీజన్ లో పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రావాలంటే ఈ స్థాయి డిస్ట్రిబ్యూషన్ అండ కచ్చితంగా ఉండాలి. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తెలుగులో భారీ ఎత్తున అడుగుపెడుతూ, రిలీజ్ విషయంలో ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా నైజాం మార్కెట్ ను సేఫ్ హ్యాండ్స్ లో పెట్టింది.

'వాల్తేరు వీరయ్య'తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఇండస్ట్రీలో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే గత సినిమా తరహాలో కాకుండా ఈసారి బాబీ రూట్ మార్చినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా వచ్చిన పోస్టర్ లో పచ్చని పొలాలు, ముళ్ల కంచె, వర్షంలో కాలిపోతున్న హైటెన్షన్ కరెంట్ టవర్ల బ్యాక్ డ్రాప్ లో రెడ్ వార్నింగ్ బోర్డుతో డిజైన్ చేసిన పోస్టర్ చూస్తుంటే, ఇదొక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా అనే ఫీలింగ్ కలుగుతోంది.

ఈ సినిమా క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ ఎంపిక కూడా ఆసక్తికరంగా ఉంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా, మలయాళ నటి అనస్వర రాజన్, నివేదా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రొటీన్ కమర్షియల్ క్యాస్టింగ్ కాకుండా ఇలాంటి భిన్నమైన ఆర్టిస్టులను తీసుకోవడం మంచి విషయమే. ఇక తమన్ సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ తో పాటు కోన వెంకట్ రైటింగ్ టీమ్ తోడవడంతో ప్రాజెక్ట్ స్పాన్ భారీగా ఉండబోతోంది.

సంక్రాంతి సినిమాలకు చివరి రోజుల్లో థియేటర్ల సర్దుబాటు పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. కానీ రిలీజ్ కు నలభై ఐదు రోజుల ముందే నైజాం డీల్ క్లోజ్ కావడం చూస్తుంటే, స్క్రిప్ట్ మీద, మెగాస్టార్ బాబీ కాంబో మీద ట్రేడ్ వర్గాల్లో ఉన్న నమ్మకం అర్థమవుతోంది. పండుగ సీజన్ లో పోటీ ఎంత ఉన్నా, థియేటర్ల పరంగా గట్టి ఆధిక్యం దక్కించుకోవడానికి ఈ ముందస్తు ఒప్పందం బాగా ఉపయోగపడుతుంది.

వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం మిగతా ఏరియాల రైట్స్.కూడా దాదాపు క్లోజ్ అయినట్లు.తెలుస్తోంది. "ది టెరిటరీ ఈజ్ సెక్యూర్డ్" అంటూ మేకర్స్ వదిలిన పోస్టర్ తోనే 2027 సంక్రాంతి బాక్సాఫీస్ వేట మొదలైపోయింది. జనవరి 13న సినిమా రానుంది. ఇక కాకా కంటెంట్ పరంగా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.