Begin typing your search above and press return to search.

'జైలర్‌ 2'తో హ్యాట్రిక్‌... మెగా 'కాకా' హిట్ గ్యారెంటీ!

జైలర్‌ 2 హిట్‌ కావడం, ముఖ్యంగా విజువల్స్‌కి మంచి స్పందన దక్కడంతో ఇప్పుడంతా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమా వైపు చూస్తున్నారు.

By:  Ramesh Palla   |   16 Oct 2026 1:09 PM IST
జైలర్‌ 2తో హ్యాట్రిక్‌... మెగా కాకా హిట్ గ్యారెంటీ!
X

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, నెల్సన్ దిలీప్ కాంబోలో వచ్చిన 'జైలర్‌ 2' హిట్ టాక్‌ దక్కించుకుని భారీ వసూళ్ల దిశగా దూసుకు వెళ్తున్న విషయం తెల్సిందే. సినిమాకి మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లు బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. జైలర్‌ 2 విజువల్స్‌కి, ముఖ్యంగా రజనీకాంత్‌ ను స్టైలిష్‌గా చూపించిన విధానంకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రజనీకాంత్‌ అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా విజువల్స్ ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో జైలర్‌ 2 సినిమాటోగ్రఫర్‌ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కార్తిక్‌ కన్నన్‌ తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. టాలీవుడ్‌లో ముందు ముందు విజయ్ కార్తిక్ కన్నన్‌ పేరు ప్రముఖంగా వినిపించడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి కాకా సినిమా విడుదల...

జైలర్‌ 2 హిట్‌ కావడం, ముఖ్యంగా విజువల్స్‌కి మంచి స్పందన దక్కడంతో ఇప్పుడంతా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమా వైపు చూస్తున్నారు. అందుకు కారణం జైలర్‌ 2 సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన విజయ్ కార్తిక్‌ కన్నన్‌ ప్రస్తుతం రూపొందుతున్న కాకా సినిమాకు వర్క్ చేస్తున్నాడు. మెగాస్టార్‌ ను మరింత స్టైలిష్ లుక్‌లో, ఫ్యాన్స్ సర్‌ప్రైజ్‌ అయ్యే విధంగా చూపించడంలో కచ్చితంగా విజయ్‌ కార్తిక్‌ కన్నన్‌ తన ప్రతిభ కనబర్చడం ఖాయమని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. కాకా సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ లో విజువల్స్ మెగా ఫ్యాన్స్‌ ను మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారిని మెప్పించింది. అందుకే సినిమా కూడా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం మెగా ఫ్యాన్స్ కి కలిగింది. తాజాగా జైలర్ 2 విడుదలైన తర్వాత కాకా విజువల్స్ కచ్చితంగా కన్నుల పండుగను తెస్తాయనే నమ్మకం మొదలైంది.

సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కార్తిక్‌ కన్నన్‌....

విజయ్ కార్తిక్‌ కన్నన్‌ వరుసగా జైలర్‌, డాకు మహారాజ్‌, జైలర్‌ 2 సినిమాలతో సక్సెస్‌లను దక్కించుకున్నాడు. ఈ మూడు హిట్స్‌తో హ్యాట్రిక్ దక్కించుకున్న విజయ్‌ కార్తిక్‌ తదుపరి సినిమా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'కాకా' నే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వరుసగా మూడు విజయాల తర్వాత వస్తున్న సినిమా అంటే సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. కనుక తప్పకుండా కాకా సినిమా బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ విజయంగా నిలుస్తుందని కొందరు అప్పుడే విశ్లేషణలు చేస్తున్నారు. వరుసగా విజయ్‌ కార్తిక్‌ కన్నన్‌ తన ఖాతాలో నాల్గవ విజయాన్ని కాకా సినిమాతో వేసుకుంటాడనే నమ్మకం ఆయన సన్నిహితులు సైతం వ్యక్తం చేస్తున్నారు. పైగా కాకా హిట్‌ పెయిర్ కావడంతో పాటు, అద్భుతమైన టెక్నికల్‌ టీం వర్క్‌ చేస్తున్న కారణంగా సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

బాబీ దర్శకత్వంలో కాకా సినిమా...

మెగాస్టార్‌ చిరంజీవి, బాబీ కాంబోలో గతంలో వచ్చిన మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అదే కాంబోలో రాబోతున్న 'కాకా' సినిమా ముందు నుంచి భారీ అంచనాలను మోస్తూ వస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కాకా సినిమాపై మెగా ఫ్యాన్స్‌ చాలా అంచనాలు పెట్టుకుని వెయిట్‌ చేస్తున్నారు. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నా, చాలా సినిమాలు రాబోతున్నా కచ్చితంగా కాకా దే పై చేయి అవుతుందని అభిమానులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అందుకు అనుకూల పవనాలు సైతం వీస్తున్నాయని వారు అంటున్నారు. ఇద్దరిది హిట్‌ కాంబో కావడంతో పాటు, విజయ్‌ కార్తిక్‌ కన్నన్‌ సెంటిమెంట్‌ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని వారు నమ్ముతున్నారు. కాకా సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన షేడ్స్‌ ఉండే పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.