Begin typing your search above and press return to search.

కాకా.. స్పీడ్ మామూలుగా లేదు

ఒకవైపు సెట్స్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగుతుండగానే మరోవైపు డబ్బింగ్ పనులను అధికారికంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసేశారు.

By:  M Prashanth   |   25 Sept 2026 12:57 PM IST
కాకా.. స్పీడ్ మామూలుగా లేదు
X

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో వస్తున్న కాకా సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ లో రెగ్యులర్ గా పెద్ద సినిమాల షూటింగ్ మొత్తం పూర్తయ్యాక తీరిగ్గా డబ్బింగ్ పనులు మొదలుపెడతారు. కానీ కాకా టీమ్ మాత్రం ఈ రెగ్యులర్ టెంప్లేట్ ను బ్రేక్ చేసింది. ఒకవైపు సెట్స్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగుతుండగానే మరోవైపు డబ్బింగ్ పనులను అధికారికంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసేశారు.

ఈ వర్కింగ్ స్పీడ్ చూస్తుంటే డైరెక్టర్ బాబీ ఏ లెవెల్ ప్లానింగ్ తో బరిలోకి దిగాడో ఇట్టే అర్థమవుతోంది. సంక్రాంతి లాంటి పెద్ద పండుగ సీజన్ కు వచ్చే సినిమాలకు ఆఖరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్లు కామన్. విఎఫ్ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్లో ఏమాత్రం తొందరపాటు జరిగినా రిలీజ్ టైమ్ కు అవుట్ పుట్ దెబ్బతింటుంది. అలాంటి తలనొప్పులు అస్సలు రాకుండా ముందే ఎడిటింగ్, డబ్బింగ్ వ్యవహారాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు.

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈసారి బ్లడీ బెంచ్ మార్క్ సెట్ చేస్తామంటూ మేకర్స్ చెబుతున్న తీరు సినిమాపై అంచనాలు అమాంతం పెంచుతోంది. ఇందులో చిరు ఆక్వా ఫ్యాక్టరీ సూపర్ వైజర్ సత్యంగా కనిపించనున్నారు. సైలెంట్ గా ఉండే ఆ నార్మల్ వ్యక్తి వెనుక దాగున్న కదిరి కాళిదాస్ అనే భయంకరమైన గ్యాంగ్ స్టర్ ఫ్లాష్ బ్యాక్ ఈ కథకు మెయిన్ పాయింట్. మాస్ ఎలివేషన్స్ కాకుండా గట్టి ఎమోషన్ ఉండేలా బాబీ ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు.

అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ టైటిల్ గ్లింప్స్ లోనే తన మార్క్ చూపించిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అస్సెట్ కాబోతున్నాడు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న కాకా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఫెస్టివల్ రేసులో బాక్సాఫీస్ పోటీ మామూలుగా ఉండదు. భారీ చిత్రాల మధ్య అలాంటి క్లాష్ లో నిలబడాలంటే ప్రమోషన్స్, కంటెంట్ డెలివరీ పక్కాగా జరగాలి. అందుకే అటు షూట్ తో పాటే ఇటు పోస్ట్ ప్రొడక్షన్ ను పరుగులు పెట్టించడం చూస్తుంటే మెగా టీమ్ ఎంత అలర్ట్ గా పని చేస్తుందో తెలుస్తోంది.

టాలీవుడ్ లో పెద్ద హీరోల రిలీజ్ డేట్లు తరచూ వాయిదా పడుతున్న ఈ టైమ్ లో పండుగకు ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే డబ్బింగ్ రూమ్ లోకి వెళ్లడం నిజంగా ఒక పాజిటివ్ సిగ్నల్. సరైన ప్లానింగ్ ఉంటే పండుగ రేసులో ఎన్ని సినిమాలు ఉన్నా టెన్షన్ లేకుండా అనుకున్న టైమ్ కు రావొచ్చని ఈ టీమ్ ప్రూవ్ చేస్తోంది. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ ఈసారి మెగా ఫ్యాన్స్ కు అంతకు మించిన ట్రీట్ రెడీ చేస్తున్నాడు.