Begin typing your search above and press return to search.

కాకా సినిమాలో చిరంజీవి రోల్స్ ఇవేనా?

2027 సంక్రాంతికి విడుదల కావాల్సిన చిరంజీవి ‘కాకా’ వాయిదా పడొచ్చని, ‘విశ్వంభర’ బరిలోకి దిగొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ‘కాకా’నే సంక్రాంతికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇందులో చిరంజీవి రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారనే వార్తలు ఆసక్తి పెంచుతున్నాయి. బాబీ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

By:  Ramesh Palla   |   27 Nov 2026 5:00 PM IST
కాకా సినిమాలో చిరంజీవి రోల్స్ ఇవేనా?
X

మెగాస్టార్‌ చిరంజీవి 2027 సంక్రాంతికి 'కాకా' సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని, ప్యాచ్ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తి చేశారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కాకా సినిమా సంక్రాంతికి రాకపోవచ్చు, విశ్వంభర సినిమాను సంక్రాంతి రేసులో దించవచ్చు అనే ప్రచారం మొదలైంది. విశ్వంభర సినిమా సంక్రాంతికి వచ్చిన కాకా సినిమా సంక్రాంతికి రావాల్సిందే అని మెగా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. విశ్వంభర సినిమాను మరికొన్ని రోజులు వాయిదా వేసుకుంటే బెటర్‌ అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందిన 'కాకా' సినిమా టీజర్‌, పోస్టర్స్‌ మెగా ఫ్యాన్స్‌లోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెంచాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఈ సంక్రాంతికి కాకా రావాల్సిందే అని అభిమానులతో పాటు ప్రేక్షకులు బలంగా కోరుకుంటున్నారు.

కాకా సినిమాలో చిరంజీవి...

కాకా సినిమాలో చిరంజీవి పాత్ర గురించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ సోషల్‌ మీడియాలో బలంగా వినిపిస్తున్న వార్తలు, కథనాల ప్రకారం రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో చిరంజీవి కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఒక పాత్రకు సంబంధించిన లుక్‌ రివీల్‌ అయింది. అందులో చిరంజీవి కాస్త ఏజ్ ఎక్కువ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కాస్త తెల్లగడ్డం, సాల్ట్ అండ్ పెప్పర్‌ లుక్‌తో చిరంజీవి సర్‌ప్రైజ్ చేశాడు. అంతే కాకుండా ఈ సినిమాలోని చిరంజీవి పోషిస్తున్న ఆ పాత్రకు పెద్ద కూతురు కూడా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అనస్వర రాజన్‌ ను ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా చూడబోతున్నాం. ఆమె నటన చాలా బాగుందని, ఆమె మూగ అమ్మాయి గా కనిపించబోతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఒక చేపల చెరువు వద్ద కనిపించడంతో ఏం చేస్తాడా అనే చర్చ కూడా మొదలైంది.

టాలీవుడ్‌లో భారీ చిత్రం...

చిరంజీవి కదిరి కాళిదాసు పాత్ర ఇప్పటి వరకు బయటకు వచ్చింది. సినిమాపై అంచనాలు పెంచింది. చిరంజీవి స్వయంగా కదిరి కాళిదాస్‌ పాత్ర గురించి బయటకు చెప్పాడు. టైటిల్‌ సైతం కదిరి కాళిదాస్ అని పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. కానీ చివరకు కాకా అనే టైటిల్‌ తో సినిమాను విడుదల చేయబోతున్నారు. చిరంజీవి మరో పాత్రను కె సత్యంగా చెబుతున్నారు. ఆ పాత్ర ఏంటీ, కాళిదాస్‌ కి సత్యంకు సంబంధం ఏంటీ అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడా లేదంటే రెండు పాత్రలు వేరు వేరు కాదు, ఒకే పాత్ర కానీ కొన్ని కారణాల వల్ల రెండు పేర్లతో కనిపించబోతున్నాడా, ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. రెండు విభిన్నమైన పాత్రలు అయితే మాత్రం మెగాఫ్యాన్స్ కి కచ్చితంగా డబుల్‌ ధమాకా అనడంలో సందేహం లేదు.

2027 సంక్రాంతికి కాకా మూవీ...

2027 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న కాకా సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో స్పష్టత రాలేదు. సీనియర్‌ హీరోయిన్‌ ను చిరంజీవికి జోడీగా నటింపజేశారు. ఈ సినిమా చిరంజీవి గత రెగ్యులర్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాల మాదిరిగా కాకుండా దర్శకుడు బాబీ కొత్తగా రూపొందిస్తున్నాడు అని మేకర్స్‌ చెబుతూ వస్తున్నారు. ఈ సినిమా కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో కె నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈయన గత చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా విజయ్‌ చివరి మూవీ జన నాయగన్‌ కు ఈయనే నిర్మాత అనే విషయం తెల్సిందే. తెలుగులో ఈయన బ్యానర్‌లో డైరెక్ట్‌ మూవీ చేస్తున్న నేపథ్యంలో అంచనాలు పెరిగాయి. చిరంజీవి వంటి మెగాస్టార్‌తో టాలీవుడ్‌లో కేవీఎన్‌ ప్రొడక్షన్‌ పాతుకు పోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి డ్యూయల్‌ రోల్‌ అయితే కాకా కచ్చితంగా రూ.200 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.