Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ 'పెద్ది'.. మెగాస్టార్ మనసంతా ఇక్కడేనట!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.

By:  M Prashanth   |   4 Jun 2026 5:35 PM IST
రామ్ చరణ్ పెద్ది.. మెగాస్టార్ మనసంతా ఇక్కడేనట!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచిలో జరుగుతున్న షూటింగ్‌ తో బిజీగా ఉన్నప్పటికీ తన మనసంతా పెద్దిపైనే ఉందంటూ ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతోంది.

గత రెండేళ్లుగా ఆ సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టం, డెడికేషన్ ను దగ్గర నుంచి చూశానని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోందని చెప్పారు. పెద్ది పాత్రలో పూర్తిగా ఒదిగిపోయే నటించేందుకు చరణ్ ఎంతో కష్టపడ్డాడని, అది ప్రతి సీన్ లో కనిపిస్తోందని కొనియాడారు.

సినిమా విజయానికి దర్శకుడు బుచ్చిబాబు సనా మరో కారణమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అద్భుతమైన కథను రాసి, అదే రేంజ్ లో స్క్రీన్ పై చూపించినందుకు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. అలాగే తొలి చిత్రాన్నే భారీ స్థాయిలో నిర్మించిన నిర్మాత వెంకట సతీశ్ కిలారును ప్రశంసించారు. ఎక్కడా రాజీ పడకుండా మూవీని రూపొందించినందుకు ఆయనకు విషెస్ చెప్పారు.

సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటుల గురించి కూడా చిరంజీవి ప్రస్తావించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటనను మెచ్చుకున్నారు. అలాగే అప్పలసూరి పాత్రలో నటించిన జగపతిబాబు ఏకంగా జీవించారని కొనియాడారు. చిత్రంలోని ఇతర క్యాస్టింగ్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని పేర్కొన్నారు. సినిమా విజయానికి టెక్నీషియన్స్ పాత్ర కూడా ఎంతో ముఖ్యమని చిరంజీవి చెప్పారు.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి అసెట్స్ గా మారాయని అభినందించారు. సినిమాకు వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ మొత్తం ప్రశంసలకు అర్హులని పేర్కొన్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్‌ తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఆయన విషెస్ తెలిపారు. నిర్మాణ భాగస్వాములుగా ఉన్న బ్యానర్లకు కూడా స్పెషల్ విషెస్ చెప్పారు.

అయితే పెద్ది సాధించిన విజయం తెలుగు సినిమా రేంజ్ ను మరింత పెంచాలని, ఫ్యూచర్ లో మరిన్ని మైల్ స్టోన్స్ అందుకోవాలని కోరుకున్నారు. ఇక పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్ అయిన తొలి షోల నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చరణ్ యాక్టింగ్, పాత్ర కోసం ఆయన మేకోవర్, ఎమోషనల్ సీన్స్ లో యాక్షన్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక కొడుకు విజయాన్ని చూసి తండ్రిగా తాను గర్వపడుతున్నాంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పెద్ది విజయం వెనుక ఉన్న కృషిని గుర్తు చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు సినిమా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ మెగాస్టార్ వ్యక్తం చేసిన అభిప్రాయం అభిమానుల్లో జోష్ ను నింపుతోంది.