Begin typing your search above and press return to search.

చిరంజీవి హనుమాన్.. మరో మహావతార్ అవుతుందా..?

యానిమేషన్ సినిమాలకు కాలం చెల్లిందనుకున్న టైం లో హాలీవుడ్ సినిమాలు చూసి ఆహా ఓహో అని అనుకుంటున్న మనం.

By:  Ramesh Boddu   |   21 Aug 2025 6:00 PM IST
చిరంజీవి హనుమాన్.. మరో మహావతార్ అవుతుందా..?
X

యానిమేషన్ సినిమాలకు కాలం చెల్లిందనుకున్న టైం లో హాలీవుడ్ సినిమాలు చూసి ఆహా ఓహో అని అనుకుంటున్న మనం. మన దగ్గర ఒక యానిమేషన్ సినిమా వచ్చేసరికి.. అది కూడా మహావతార్ నరసిం హ కథతో వచ్చే సరికి భుజాన వేసుకుని హిట్ చేశారు. తెర మీద అంతా బొమ్మలే అని తెలిసినా సరే ప్రేక్షకులను తన్మయత్వంలో మునిగిఓయేలా చేశారు మహావతార్ టీం. అలా యానిమేటెడ్ సినిమాలకు ఒక కొత్త నూతనోత్సాహం తెచ్చారు.

AI టెక్నాలజీతో చిరంజీవి హనుమాన్

ఇప్పుడు వారిని చూసి చిరంజీవి హనుమాన్ అనే సినిమా మొదలు పెట్టారు బాలీవుడ్ మేకర్స్. అబండాంటియా ఎంటర్టైన్మెంట్స్, కలెక్టివ్ మీడియా నెట్వర్క్ బ్యానర్ లో చిరంజీవి హనుమాన్ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఏ.ఐ టెక్నాలజీ వాడి చేస్తున్నట్టు తెలుస్తుంది. మహావతార్ నరసిం హ సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నారు.

చిరంజీవి హనుమాన్ సినిమాను 2026 హనుమాన్ జయంతి సినిమాకు రిలీజ్ ప్లాన్ చేశారు. ఇండియన్ స్క్రీన్ మీద మైథాలజీ సినిమాలకు మంచి డిమాండ్ కొనసాగుతుంది. ముఖ్యంగా యానిమేటెడ్ సీరీస్ లుగా ఇవి వస్తున్నాయి. హోంబలే ప్రొడక్షన్స్ ఏ ముహుర్తాన మహావతార్ సీరీస్ లు మొదలు పెట్టారో కానీ దానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

మహావతార్ నరసింహ పంథాలోనే..

మహావతార్ నరసింహ నే కాదు వాళ్లు ఏకంగా మరో ఆరు సీరీస్ లు ప్లాన్ చేశారు. ఐతే ఇప్పుడు వారి పంథాలోనే చిరంజీవి హనుమాన్ అంటూ ఒక కొత్త సినిమా రాబోతుంది. ఈ సినిమాను విక్రం మళోత్రాం విజయ్ సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. AI జెనరేటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు. ఐతే పోస్టర్ తోనే చిరంజీవి హనుమాన్ వైబ్ ఏంటో చూపించారు మేకర్స్.

ఐతే ఏ.ఐ తో సినిమా చేసినా కూడా ఆడియన్స్ మనసులను తాకేలా కథ, కథనాలు ఉంటే కచ్చితంగా సినిమా వర్క్ అవుట్ అవుతుంది. మహావతార్ తర్వాత ఇండియా లెవెల్ లో ఇలాంటి యానిమేటెడ్, ఏ.ఐ జెనరేటెడ్ సీరీస్ లు చాలా వస్తాయని ఎక్స్ పెక్ట్ చేశాం. అనుకున్నట్టుగానే చిరంజీవి హనుమాన్ సినిమా మొదలు పెట్టారు. మరి రాబోతున్న ఈ సినిమాలు ఏమేరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయన్నది చూడాలి.