పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ? చీఫ్ గెస్ట్ ఎవరంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
By: Madhu Reddy | 23 Jun 2026 3:16 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ ఈరోజు హైదరాబాద్‌లో ఒక గ్రాండ్ సక్సెస్ మీట్‌ను ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తుండటంతో.. తండ్రి, కొడుకులు ఒకే స్టేజ్‌పై కనిపించబోతున్నారు. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఆ వివరాలు ఇలా వున్నాయి..
శిల్పకళా వేదికలో మెగా వేడుక:
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ‘పెద్ది’ సక్సెస్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలో చిరంజీవితో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు సానా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మరియు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొనబోతున్నారు. ఇక ఇప్పుడు ఒకే వేదికపై చిరంజీవి, చరణ్ ఇద్దరూ మాట్లాడనుండటంతో టాలీవుడ్‌లో ఈ ఈవెంట్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ రచ్చ:
ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్‌ఫుల్ రగ్గడ్ పాత్రలో కనిపించి థియేటర్లలో పూనకాలు తెప్పించాడు. ఆయన నటన, ఎమోషనల్ సీన్స్, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాను వన్ మ్యాన్ షోగా నిలబెట్టాయి. ఇక జాన్వీ కపూర్ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీల నటన ఈ సినిమాకు కొండంత బలాన్ని ఇచ్చాయి.
రెహమాన్ మ్యాజిక్.. బుచ్చిబాబు మార్క్:
ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఇక ఉప్పెన తర్వాత బుచ్చిబాబు సానా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేసిన విధానానికి ఇండస్ట్రీ పెద్దల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి..
‘పెద్ది’ సక్సెస్ మీట్‌లో చిరంజీవి గెస్ట్‌గా రావడం మెగా ఫ్యాన్స్‌కు అసలైన పూనకాలు తెచ్చే విషయమే. ఈ వేడుకలో కొడుకు సాధించిన 400 కోట్ల భారీ విజయంపై మెగాస్టార్ ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు? చరణ్ ఏమి మాట్లాడతారో అనే కుతూహలం అందరిలోనూ ఉంది. ఈ రోజు సాయంత్రంతో మెగా అభిమానులకు అసలైన పండగ షురూ కానుంది..
