మెగానందం.. ఇలాంటి దశ మళ్లీ రాదేమో..!
అటు బాక్సాఫీస్ వద్ద `మన శంకర వరప్రసాద్ గారు` సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం, ఇటు ఇంట్లో మనవడు- మనవరాలి రాకతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది.
By: Sivaji Kontham | 16 Feb 2026 9:17 AM ISTమెగాస్టార్ చిరంజీవికి ఇది నిజంగానే ఒక అద్భుతమైన సమయం. అటు బాక్సాఫీస్ వద్ద `మన శంకర వరప్రసాద్ గారు` సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం, ఇటు ఇంట్లో మనవడు- మనవరాలి రాకతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం చిరంజీవి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో అత్యంత ఆనందకర సమయాన్ని ఆస్వాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మనవరాలు క్లిన్ కారాకు ఒక తమ్ముడు - చెల్లి తోడైన తర్వాత తాతగారైన చిరంజీవిలో ఆనందానికి అవధుల్లేవ్. రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు జన్మించిన కవలలకు శివరామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అనే రెండు పేర్లను పెట్టుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి తన సమయాన్ని ఈ బుజ్జి మనవళ్లతో గడపడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే అనీల్ రావిపూడితో `మన శంకర వరప్రసాద్ గారు` బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి `సైరా నరసింహారెడ్డి` రికార్డులను కూడా అధిగమించింది. ఈ విజయంతో మెగాస్టార్ చాలా రిలాక్స్‌డ్‌గా, రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు.
అయితే సినిమా షూటింగ్ సమయంలోనే చిరంజీవి మోకాలి నొప్పితో బాధపడ్డారు. షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన చిన్న సర్జరీ చేయించుకున్నారు. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే బాబి కొల్లి సినిమా షూటింగ్ కొద్ది వారాల పాటు వాయిదా పడింది.
ఈ విరామం తర్వాత ఆయన తిరిగి తన సినిమాల రిలీజ్ లపై దృష్టి సారించాల్సి ఉంటుంది. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర` షూటింగ్ దాదాపు పూర్తయింది. భారీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఇది జులై 10న విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య తర్వాత మళ్లీ చిరు-బాబి కాంబో రిపీట్ కాబోతోంది. ఇది ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా అని సమాచారం. మార్చి నుండి దీని షూటింగ్ ప్రారంభం కానుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో కూడా ఒక సినిమా చర్చల దశలో ఉంది.
ఒకవైపు కెరీర్ హై.. మరోవైపు కుటుంబంతో ఆనందకరమైన క్షణాలు.. మెగాస్టార్‌కు ఇది నిజంగానే గోల్డెన్ పీరియడ్. ఇదే ఉత్సాహంలో ఆయన గాయం నుంచి కోలుకుని వేగంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ వాటిని రిలీజ్ కి తేవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
