అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్.. అదిరింది!
ఈ భారీ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో చిరంజీవి ఒక అద్భుతమైన ప్రేమను చూపించారు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఒక కాస్ట్లీ రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కారు ఫొటోలే వైరల్ అవుతున్నాయి.
By: M Prashanth | 26 Jan 2026 9:07 AM ISTమెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తన వింటేజ్ మాస్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతుండటంతో మెగా కాంపౌండ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ భారీ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో చిరంజీవి ఒక అద్భుతమైన ప్రేమను చూపించారు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఒక కాస్ట్లీ రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కారు ఫొటోలే వైరల్ అవుతున్నాయి.
నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రీజినల్ పరంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. మెగాస్టార్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటున్నారో.. సరిగ్గా అదే బాడీ లాంగ్వేజ్, ఎనర్జీతో అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. అందుకే ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం అనిల్ రావిపూడికి ఇస్తూ.. చిరంజీవి ఇంత ఖరీదైన కారును బహుమతిగా అందించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో కూడా చిరంజీవి తన దర్శకులకు గిఫ్ట్‌లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక లగ్జరీ కారును ప్రెజెంట్ చేయడం ఇదే మొదటిసారి. అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా గతంలో చిరంజీవి ఒక ప్రీమియం వాచీని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఏకంగా రేంజ్ రోవర్ కారునే ఇచ్చి తమ మధ్య ఉన్న బంధాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లారు. అనిల్ రావిపూడి కెరీర్‌లో కూడా ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌గా నిలిచిపోయింది.
ప్రస్తుతం ఈ సినిమా మూడో వారంలోకి అడుగు పెడుతున్నా బుకింగ్స్ ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్కరోజే బుక్‌మైషోలో ఒక లక్షకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం మెగాస్టార్ స్టామినాను నిరూపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇటు సినిమా సక్సెస్, అటు అనిల్ రావిపూడికి ఇచ్చిన గిఫ్ట్‌తో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
సినిమా మేకింగ్ సమయంలోనే అనిల్ రావిపూడి, చిరంజీవి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. చిరంజీవి నుంచి ఇలాంటి గిఫ్ట్ అందుకోవడం అనిల్ రావిపూడికి దక్కిన ఒక మెగా గౌరవంగా చెప్పవచ్చు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో ఈ సినిమా నిరూపించింది. వరుస ఫ్లాపుల తర్వాత చిరంజీవి మళ్ళీ తన బాక్సాఫీస్ పవర్ ఏంటో ఈ సినిమాతో చూపించారు. ఫైనల్ గా 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ దగ్గరే కాకుండా.. చిరంజీవి మనసు గెలుచుకోవడంలోనూ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా సాధిస్తున్న రికార్డులు టాలీవుడ్‌లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాయి.
