Begin typing your search above and press return to search.

ఈ జనరేషన్ దర్శకులలో చిరంజీవికి నచ్చిన డైరెక్టర్ ఎవరంటే?

గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న ఏకైక నటుడు చిరంజీవి. ఇప్పటివరకు 150 కి పైన సినిమాలు చేశాడు.

By:  Gopi Velupala   |   14 Oct 2026 4:00 AM IST
ఈ జనరేషన్ దర్శకులలో చిరంజీవికి నచ్చిన డైరెక్టర్ ఎవరంటే?
X

గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న ఏకైక నటుడు చిరంజీవి. ఇప్పటివరకు 150 కి పైన సినిమాలు చేశాడు. ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలను పోషించిన చిరంజీవి ఇప్పటికీ బాక్సాఫీస్ రికార్డుల రారాజు గా వెలుగొందుతున్నాడు. ఇప్పటికి తన దూకుడును చూపిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.

ఈ జనరేషన్ లో చిరంజీవి ఫేవరేట్ డైరెక్టర్

ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్లో 'కాకా' సినిమా చేస్తున్నాడు. 2027 సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తొందరలోనే బ్యాలెన్స్ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి అనుకున్న టైమ్ కి సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ జనరేషన్లో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నప్పటికి చిరంజీవికి నచ్చిన ఏకైక దర్శకుడు 'రాజమౌళి'. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి విస్తరించిన దర్శకుడు కావడం వల్ల రాజమౌళి అంటే చిరంజీవికి అమితమైన గౌరవం ఉంది. తన డైరెక్షన్లో నటించే అవకాశం వస్తే చేయడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నానని గతంలో పలు సందర్భాల్లో చెప్పాడు. 'మగధీర' సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో చిరంజీవి నటించాడు. ఆ సినిమా సమయంలోనే రాజమౌళి ప్రతిభను గుర్తించాడు. సినిమా చూసిన వెంటనే రాజమౌళిని అప్రిషియేట్ చేశాడట...

చిరంజీవి - రాజమౌళి ప్రాజెక్ట్ ఉంటుందా

చిరంజీవి - రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం రాజమౌళికి ఉన్న కమిట్ మెంట్స్ చిరంజీవి చేస్తున్న సినిమాలను బట్టి చూస్తే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమనే చెప్పాలి... చిరంజీవి సోలో హీరోగా రాజమౌళి డైరక్షన్ లో సినిమా రాకపోవచ్చేమో కానీ రాజమౌళి తెరకెక్కించబోయే 'మహాభారతం' సినిమాలో తప్పకుండా చిరంజీవి పాత్ర ఉంటుంది. ఆయన ఏ పాత్రలో కనిపించినా కూడా రాజమౌళి చిరంజీవిని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాడు. రాజమౌళి డైరెక్షన్లో ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు నటించాలి అనుకోడానికి గల ముఖ్య కారణం ఏంటంటే.

ఒకసారి ఆయనతో వర్క్ చేస్తే ఆ నటుడిలో తనకే తెలియని ఒక్క కొత్త కోణాన్ని బయటికి తీసుకువస్తాడు. వాళ్ళను ఉత్తమ నటులుగా మారుస్తూ ఉంటాడు. కాబట్టి రాజమౌళి తో సినిమా చేయక ముందు, సినిమా చేసిన తర్వాత అనేలా నటుల నటనలో పరిణితిని తీసుకువస్తాడు. చిరంజీవి పరిపూర్ణమైన నటుడు కాబట్టి అతని నుంచి వచ్చే ప్రతి సినిమా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. నటన పరంగా కూడా ఆయన చాలా వైవిధ్యాన్ని చూపిస్తాడు. కాబట్టి రాజమౌళి సినిమాలో చిరంజీవి నటిస్తే బాగుంటుందని ఇటు రాజమౌళి అభిమానులు, అటు చిరంజీవి అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు...