Begin typing your search above and press return to search.

గుండె నిండా సంతోషంతో మెగాస్టార్ ఎమోషనల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల కవలల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో మారుమోగిపోతున్నాయి.

By:  M Prashanth   |   14 Feb 2026 2:28 PM IST
గుండె నిండా సంతోషంతో మెగాస్టార్ ఎమోషనల్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల కవలల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో మారుమోగిపోతున్నాయి. ఈ పేర్లపై వస్తున్న ప్రశంసలకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో గర్వంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చరణ్, ఉపాసనలతో కలిసి ఉన్న ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేస్తూ.. తన గుండె నిండా ఉన్న సంతోషాన్ని, ఆ పేర్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ప్రపంచానికి మరోసారి వివరించారు.




రామ్ చరణ్ దంపతులు తమ పిల్లలకు ఆధ్యాత్మిక మూలాలున్న పేర్లను ఎంపిక చేసుకోవడం చిరంజీవిని బాగా ఆకట్టుకుంది. మన సనాతన సంప్రదాయాన్ని, తరతరాలుగా వస్తున్న సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు చిరంజీవి గర్వంగా ఫీలవుతున్నారు. ఈ పేర్లలో దైవ కృప, భక్తి దాగి ఉన్నాయని.. ఇవి పవిత్ర దేవాలయాల దీవెనలతో సిద్ధమైన పేర్లని ఆయన కొనియాడారు.

తన మనవరాలి పేరు చివర ‘దేవి’ అని చేర్చడం వెనుక చరణ్ చూపించిన ఆత్మీయత చిరంజీవి మనసును కదిలించింది. తన బామ్మ అంజనా దేవి గారి జ్ఞాపకార్థం, ఆ పేరులోని ‘దేవి’ని పాప అన్వీరా పేరులో చేర్చడం ఒక గొప్ప సంస్కారమని ఆయన పేర్కొన్నారు. ఒక తండ్రిగా చరణ్ తన తల్లిపై చూపించిన ఈ గౌరవం చిరంజీవికి ఎంతో గర్వాన్ని ఇచ్చింది. ఇది కేవలం పేరు కాదు, ఒక కుటుంబ వారసత్వానికి చరణ్ ఇచ్చిన గొప్ప రెస్పెక్ట్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

మెగా వారసుడికి ‘శివరామ్ కొణిదెల’ అని, వారసురాలికి ‘అన్వీరా దేవి కొణిదెల’ అని నామకరణం చేసినట్లు చిరంజీవి ఇదివరకే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ పేర్లు విన్నప్పటి నుండి స్నేహితులు, బంధువులు, అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. బాబు పేరులో శివుడు, రాముడు ఇద్దరి శక్తులు ఉండటమే కాకుండా.. పాప పేరులో ధైర్యం, దైవత్వం కలిసి ఉండటం ఆనందంగా ఉందని అన్నారు.

చిరంజీవి షేర్ చేసిన ఫోటోలో ఆయన మధ్యలో ఉండి చరణ్‌ని, గర్భవతిగా ఉన్న ఉపాసనను ఆత్మీయంగా హత్తుకుని ఉండటం చూస్తుంటే మెగా ఫ్యామిలీ బాండింగ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థమవుతోంది. ఈ చిన్నారుల జీవిత ప్రయాణం దైవ దీవెనలతో అద్భుతంగా సాగాలని, పిల్లలతో పాటు చరణ్ ఉపాసనలు కూడా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన మనసారా ఆశీర్వదించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

చిరంజీవి వివరణ చూస్తుంటే మెగా వారసుల పేర్లు ఎంత పక్కాగా ప్లాన్ చేశారో అర్థమవుతోంది. వారసత్వం, భక్తి, పెద్దలపై గౌరవంతో కలగలిసిన ఈ పేర్లు మెగా ఫ్యామిలీ టేస్ట్‌కు నిదర్శనంగా నిలిచాయి. మెగాస్టార్ అనౌన్స్‌మెంట్‌తో శివరామ్, అన్వీరా దేవిల పేర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాను రిలీజ్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు.