Begin typing your search above and press return to search.

ఇవాళ ఇలా ఉన్నానంటే కార‌ణం నువ్వే.. భార్యపై చిరూ ఎమోష‌న‌ల్ పోస్ట్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా హృదయాన్ని హత్తుకునేలా ఓ ఎమోష‌న‌ల్ మెసేజ్ ను షేర్ చేసుకున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 Feb 2026 2:49 PM IST
ఇవాళ ఇలా ఉన్నానంటే కార‌ణం నువ్వే.. భార్యపై చిరూ ఎమోష‌న‌ల్ పోస్ట్
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా హృదయాన్ని హత్తుకునేలా ఓ ఎమోష‌న‌ల్ మెసేజ్ ను షేర్ చేసుకున్నారు. ఫిబ్రవరి 20న తమ వివాహ వార్షికోత్సవం కూడా సమీపిస్తున్న వేళ, ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన అరుదైన ఫోటోలు షేర్ చేయడంతో పాటు తమ దాంపత్య బంధంపై ఓ దీర్ఘమైన నోట్‌ను రాశారు. ఈ మెసేజ్ ద్వారా తన అద్భుతమైన సినీ ప్రయాణానికి వెనుక ఉన్న అసలైన బలం ఎవరో మెగాస్టార్ స్పష్టంగా తెలియజేశారు.




“డియరెస్ట్ సురేఖకు హ్యాపీ బర్త్‌డే” అంటూ ప్రారంభమైన ఈ మెసేజ్‌లో, ఆమెను తమ ఫ్యామిలీకి కేంద్రబిందువుగా అభివర్ణించారు. ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రినీ ప్రేమతో కట్టిపడేసే శక్తి ఆమెదేనని, తన ఫ్యామిలీని ఆమె తన కుటుంబంగా అంగీకరించి ప్రతి సందర్భంలో అండగా నిలిచిందని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులకు నిజమైన కూతురిలా మారి, వారి ప్రేమను కూడా సంపాదించుకుందని ఆయన గుర్తుచేసుకున్నారు.




సినీ జీవితంలో అపార విజయాలు, అభిమానుల ఆదరణ, స్టార్‌డమ్ అన్నీ ఉన్నప్పటికీ, తన స‌క్సెస్ సీక్రెట్ గురించి ఎవరైనా అడిగితే అది తన టాలెంట్, కష్టపడే స్వభావం కాదని స్పష్టంగా చెప్తూ, త‌న సక్సెస్ సీక్రెట్ సురేఖ‌నే అంటూ త‌న లైఫ్ లో భార్య పాత్రను ఎంతో విన‌మ్రంగా ఒప్పుకున్నారు. కుటుంబ బాధ్యతలన్నింటినీ త‌న భార్య‌ భుజాన వేసుకోవ‌డంతో, తనకు పూర్తిగా వృత్తిపై ఫోక‌స్ చేసే స్వేచ్ఛ దొరికింద‌ని త‌న మెసేజ్‌లో పేర్కొన్నారు.

ఎలాంటి సంక్షోభాల్లోనైనా, సంబరాల్లోనైనా ఫ్యామిలీని ఒకటిగా ఉంచేది సురేఖేనని ఆయన అన్నారు. త‌న‌కు బ‌లం, మ‌న‌శ్శాంతి అన్నీ ఆమె ద్వారానే ల‌భించాయ‌ని పేర్కొంటూ, ఈ రోజు తాను ఇలా ఉండ‌టానికి కార‌ణం సురేఖ‌నే అని ఆమె ప‌ట్ల కృతజ్ఞ‌త‌ను వ్య‌క్తం చేశారు చిరంజీవి. నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ దాంపత్య బంధంపై మెగాస్టార్ చేసిన ఈ హృదయపూర్వక ప్రకటన, వారి అనుబంధం ఎంత బలమైనదో తెలియజేస్తోంది.