Begin typing your search above and press return to search.

మెగాస్టార్.. దుబాయ్ లో ఏం చేస్తున్నారు?

రీసెంట్ గా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మూవీ టీమ్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు. సినిమా పోస్ట్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు. అదే సమయంలో రీసెంట్ గా చిరు.. దుబాయ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   20 Jan 2026 3:13 PM IST
మెగాస్టార్.. దుబాయ్ లో ఏం చేస్తున్నారు?
X

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాతో ఇప్పుడు థియేటర్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. భోళా శంకర్ తర్వాత ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పాలి. దీంతో ఆయన హ్యాపీ మోడ్ లో ఉన్నారు.

రీసెంట్ గా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మూవీ టీమ్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు. సినిమా పోస్ట్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు. అదే సమయంలో రీసెంట్ గా చిరు.. దుబాయ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ తన లైనప్ లో ఉన్న మూవీపై ఫుల్ గా చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే మెగాస్టార్.. ఇప్పుడు బాబీ కొల్లితో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ సూపర్ హిట్ గా నిలవగా.. ఇప్పుడు మరోసారి కలిసి వర్క్ చేస్తున్నారు చిరు, బాబీ. కొన్ని రోజుల క్రితం మూవీ అనౌన్స్మెంట్ రాగా.. అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లో మూవీ పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు రీసెంట్ గా వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అయితే ఇప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ పై చిరు, బాబీ దుబాయ్ లో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ సూచనల మేరకు బాబీ, ఆయన టీమ్ స్క్రిప్ట్ లో ప్రస్తుతం కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అంతే కాదు చిరంజీవి సూచనల మేరకు సీనియర్ రచయిత కోన వెంకట్.. బాబీ టీమ్ రాసుకున్న స్క్రిప్ట్ ను పర్యవేక్షిస్తున్నారట. మరో రోజులో మొత్తం కంప్లీట్ అవ్వనుందట.

ఇక స్క్రిప్ట్ వర్క్ అయిపోతే.. ఫిబ్రవరిలో గ్రాండ్ గా సినిమాను బాబీ కొల్లి లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారట. ఇప్పటికే చిత్రీకరణకు ప్లేసెస్ కూడా వెతుకుతున్నట్లు సమాచారం. ఏదేమైనా కూతురి సెంటిమెంట్‌ తో ముడిపడిన యాక్షన్‌ ఎంటర్టైనర్‌ గా మూవీ ఉండనుందని సినీ వర్గాల్లో టాక్.

అదే సమయంలో సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు. మూవీలో చిరంజీవికి కూతురిగా ఓ యంగ్ అప్‌ కమింగ్ హీరోయిన్‌ ను ఎంపిక చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని కూడా ఇటీవల టాక్ వినిపించింది.