మెగా 157: రావిపూడి మాస్ బజ్ మొదలట్టేశాడుగా..
టాలీవుడ్‌లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 8 Aug 2025 2:45 PM ISTటాలీవుడ్‌లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఒకపక్క విశ్వంభర సినిమా షూటింగ్ దాదాపు పూర్తవ్వగా, మరోపక్క అనిల్ రావిపూడితో చేస్తున్న మెగా 157 ప్రాజెక్ట్ కూడా క్రేజీ అప్డేట్లతో బజ్‌ను క్రియేట్ చేస్తోంది. చిరంజీవి అభిమానులు రెండు సినిమాల కోసం భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా వింటేజ్ చిరుని మళ్లీ తెరపై చూపించే ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి. ఈ మధ్యనే దర్శకుడు విశిష్ఠ వరుస ఇంటర్వ్యూలతో విశ్వంభర సినిమాకు పబ్లిసిటీ తెస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ టాక్‌ను మించిన హంగామా అనిల్ రావిపూడి నుంచి వచ్చింది. సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి ట్వీట్ పెట్టడం చిరు అభిమానుల్లో కొత్త జోష్‌కు కారణమైంది.
"ఆగస్టు 22న త్వరగా..." అంటూ మాస్ ఇమోజీలతో పాటు, ఓ మాస్ క్లిప్‌ని కూడా షేర్ చేశారు. ఈ ట్వీట్‌తో ఆయన ఇవ్వబోయే అప్‌డేట్ మీద మేకర్స్ బోల్డ్‌గా వెళ్లబోతున్నారని అర్థమైంది. తనదైన టైమ్‌తో, చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని ఎంచుకుని ప్రేక్షకుల అంచనాలను మళ్లీ పెంచేశారు. ప్రస్తుతం చిరు 157 మూవీ షూటింగ్ ప్రారంభ దశలో ఉన్నా, అప్పుడే రిలీజ్ అప్‌డేట్ మీద భారీ ఊహాగానాలు తలెత్తుతున్నాయి.
అనిల్ మాత్రం సంక్రాంతి రిలీజ్‌ను టార్గెట్ చేసుకుని ఫిక్స్ అయిపోయారు. చిరంజీవికి ఈమధ్య కాలంలో తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలు రావడం చాలా అరుదైన విషయం. గతంలో మాత్రమే ఇది సాధ్యమైంది. ఇక ఇప్పుడు ఫ్యాన్స్‌కి అదే తీపి అనుభూతి కలిగించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. విశ్వంభర రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ రాకపోయినా, అనిల్ రావిపూడి మాత్రం తన ప్రాజెక్ట్‌పై డెడికేషన్ చూపిస్తున్నారు.
సంక్రాంతి రేస్‌లో దిగి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే ట్విటర్‌లో డబుల్ ధమాకా అంటూ ట్రెండింగ్‌కు నడిపిస్తున్నారు. 2026లో చిరంజీవి సినిమా పండగ అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇంతకీ అన్నీ అనుకున్నట్లు జరిగితే, చిరు పుట్టినరోజు స్పెషల్‌గా రెండు ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ అనిల్ రావిపూడి వెనక్కి తగ్గకుంటే, మినిమమ్ 2 నెలల గ్యాప్‌తో రెండు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.
