Begin typing your search above and press return to search.

నయన్ ఫ్యామిలీకి చిరు స్పెషల్ గిఫ్ట్!

అటు నయనతార ఫ్యామిలీ కూడా ఈసారి దీపావళి వేడుకలను చిరంజీవి కుటుంబంతో కలిసి జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ ఫోటోలను ఆయన స్వయంగా షేర్ చేశారు కూడా..

By:  Madhu Reddy   |   22 Oct 2025 12:23 PM IST
నయన్ ఫ్యామిలీకి చిరు స్పెషల్ గిఫ్ట్!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. మరొకవైపు తన తోటి నటీనటులకు ఎప్పటికీ చేరువలోనే ఉంటారు. ముఖ్యంగా 80'స్ నటీనటులతో గెట్ టుగెదర్ పార్టీలు నిర్వహిస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునే ఈయన.. ఈమధ్య తమతో కలిసి నటించే నటీనటులను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి మరీ వారి కోసం స్పెషల్ గిఫ్ట్ లను కూడా అందిస్తున్నారు.




ఇదిలా ఉండగా తాజాగా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో భాగమైన నయనతార ఫ్యామిలీతో పాటు వెంకటేష్ అలాగే తన స్నేహితుడు నాగార్జున ఫ్యామిలీ లను తన ఇంటికి ఆహ్వానించారు చిరంజీవి. అందులో భాగంగానే నయనతార దంపతులకు స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చి మరొకసారి వారిపై ఉన్న ఇష్టాన్ని చూపించారు. అటు నయనతార ఫ్యామిలీ కూడా ఈసారి దీపావళి వేడుకలను చిరంజీవి కుటుంబంతో కలిసి జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ ఫోటోలను ఆయన స్వయంగా షేర్ చేశారు కూడా..




ఇదిలా ఉండగా.. తమ ఇంటికి దీపావళి సందర్భంగా అతిథులుగా వచ్చిన నయనతార కుటుంబానికి చిరంజీవి ఒక స్పెషల్ బహుమతిని ఇచ్చారు. అదే దుర్గాదేవి ప్రతిమ పొదిగి ఉన్న శంఖాన్ని నయనతార దంపతులకు బహుమతిగా ఇచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను నయనతార తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలతో పాటు.. "ఈ ఏడాది దీపావళి చాలా భిన్నంగా అనిపించింది. వెచ్చదనం, ప్రేమ, నా చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎన్నడూ ఊహించని ఒక కొత్త ఇంటిని కనుగొన్నాను.. ఎన్నడూ అనుభవించని సరికొత్త అనుభూతి కలుగుతోంది. ముఖ్యంగా ఈ వెలుగు ఎప్పుడూ మన చుట్టూ ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది నయనతార. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఆ ఫోటోలలో నయనతార దంపతులకు చిరంజీవి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ మరోసారి వైరల్ గా మారింది.

నిజానికి గతంలో కూడా ఇలాంటి బహుమతినే చిరంజీవి శ్రీ లీలాకు ఇచ్చిన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే .. విశ్వంభర సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. శ్రీ లీల ఆ సినిమా సెట్ కి వెళ్ళింది. ఆరోజు మహిళా దినోత్సవం. ఆ సందర్భంగా చిరంజీవి, శ్రీలీలను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ ఆమెకు దుర్గాదేవి ప్రతిమ ఉన్న శంఖాన్ని బహుమతిగా అందించారు. అంతేకాదు శ్రీ లీల ఈ సినిమాలో నటిస్తున్నట్లు గతంలోనే వార్తలు రాగా.. అవి కాస్త ఆ ఫోటోలతో నిజమని నిరూపించాయి. అలా మొత్తానికైతే చిరంజీవి ఆ శంఖం ను తమకు నచ్చిన వారికి బహుమతిగా అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొత్తానికైతే మొన్న శ్రీ లీల.. నేడు నయనతార దంపతులు.. నెక్స్ట్ ఈ బహుమతిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి అంటూ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.