స్విట్జర్లాండ్‌లో మెగాస్టార్ తో రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
By: M Prashanth | 21 Jan 2026 11:38 AM ISTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. చిరంజీవి గారు అక్కడే ఉన్నారని తెలుసుకున్న సీఎం, ఆయనను ఈ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి పంపిన ఆహ్వానాన్ని గౌరవించి చిరంజీవి గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించే సమయంలో ఆయన అక్కడే ఉండటం విశేషం. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమంలో ఒక సినీ దిగ్గజం పాల్గొనడం రాష్ట్ర సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా పెంచింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్‌ను ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి కూర్చుని కాసేపు ముచ్చటించారు. కేవలం రాజకీయాలే కాకుండా సినిమాల గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు' గురించి సీఎం స్పెషల్‌గా ప్రస్తావించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
సినిమా కబుర్లు చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ షేర్ చేశారు. తన కుటుంబంతో కలిసి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చూశానని, అందరికీ మూవీ బాగా నచ్చిందని చిరంజీవి గారితో నేరుగా చెప్పారు. సినిమాలోని ఎంటర్‌టైన్‌మెంట్ బాగుందని ఆయన మెచ్చుకోవడంతో మెగాస్టార్ కూడా ఆనందం వ్యక్తం చేశారు.
విదేశీ గడ్డపై ఇలాంటి పర్సనల్ కాంప్లిమెంట్ దక్కడం సినిమా టీమ్ కు కూడా ఒక మంచి బూస్ట్ అని చెప్పాలి. నిజానికి చిరంజీవి గారు ఇది కేవలం ఫ్యామిలీ వెకేషన్ కోసమే ప్లాన్ చేసుకున్నారు. కానీ ఊహించని విధంగా అక్కడ ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం, ఒక గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో పాల్గొనడం మెమరబుల్ గా మారింది. ఇద్దరు ప్రముఖులు విదేశాల్లో ఇలా ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ సింప్లిసిటీకి రేవంత్ రెడ్డి చూపిస్తున్న మర్యాదకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మొత్తానికి దావోస్ సదస్సులో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి మెగాస్టార్ రాక ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రాజకీయం, సినిమా అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి ఉండటం మంచి పరిణామం అని ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీతో సరదాగా గడపడానికి వెళ్ళిన చిరంజీవి గారు, ఇలా అనుకోకుండా ఒక అంతర్జాతీయ సదస్సులో భాగమవ్వడం ఒక ప్రైడ్ మూమెంట్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నారు.
