Begin typing your search above and press return to search.

చిరు కోర్ట్‌కి వెళ్లడానికి అసలు కారణం ఇదే...!

మెగాస్టార్‌ చిరంజీవి ఉన్నట్లుండి ఎందుకు కోర్ట్‌కు వెళ్లి ఆ ఆర్డర్‌ తీసుకు వచ్చారు అంటూ చాలా మంది చర్చించుకున్నారు.

By:  Ramesh Palla   |   27 Oct 2025 12:21 PM IST
చిరు కోర్ట్‌కి వెళ్లడానికి అసలు కారణం ఇదే...!
X

సోషల్‌ మీడియాలో ఒకప్పుడు సెలబ్రిటీలపై నెగిటివ్‌ కామెంట్స్ చేయడం ద్వారా రాక్షస ఆనందం పొందిన వారు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డీప్‌ ఫేక్ వీడియోలు, ఫోటోలు క్రియేట్‌ చేసి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే వరకు వెళ్లింది. సోషల్‌ మీడియాలో ఈ విధంగా చాలా మంది సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో డీప్‌ ఫేక్ వీడియోల క్రియేషన్‌ చాలా ఈజీ కావడంతో, ఏఐ ను ఉపయోగించి ఎవరికి తోచిన విధంగా వారు ఇష్టానుసారంగా తమకు ఇష్టం లేని సెలబ్రిటీలపై విషం కక్కుతున్నారు. ఈ కారణం వల్లే మెగాస్టార్‌ చిరంజీవి కోర్ట్‌కు వెళ్లి మరీ సోషల్‌ మీడియాలో తన గురించి ఎవరు కానీ... ఎలాంటి వీడియోలు ఫోటోలు క్రియేట్‌ చేయవద్దని ఆర్డర్‌ తెచ్చుకున్నారు. చిరంజీవి పేరును కూడా ఉపయోగించకూడదు అంటూ స్వయంగా కోర్ట్‌ నుంచి ఆర్డర్ రావడం చర్చనీయాంశం అయింది.

సైబర్ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌కి చిరంజీవి ఫిర్యాదు

మెగాస్టార్‌ చిరంజీవి ఉన్నట్లుండి ఎందుకు కోర్ట్‌కు వెళ్లి ఆ ఆర్డర్‌ తీసుకు వచ్చారు అంటూ చాలా మంది చర్చించుకున్నారు. అసలు విషయం ఏంటంటే ఇటీవల చిరంజీవి డీప్‌ ఫేక్ వీడియోలను క్రియేట్‌ చేసిన కొందరు సోషల్‌ మీడియాలో షేర్ చేశారట. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న ఆ ఫోటోలు, వీడియోలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి ఫిర్యాదు చేయడం జరిగింది. స్వయంగా సీపీ సజ్జనార్‌ను కలిసి చిరంజీవి ఫిర్యాదు చేశారని, వెంటనే వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకుని విచారణ మొదలు పెట్టినట్లు పోలీసు వర్గాల వారు చెబుతున్నారు. చిరంజీవి అనుమతి లేకుండా వినియోగిస్తున్న ఫోటోలు వీడియోలను వెంటనే తొలగించాలని లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసు వర్గాల వారు సోషల్‌ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది.

చిరంజీవి డీప్‌ ఫేక్ వీడియోలు..

సిటీ సివిల్‌ కోర్ట్‌ నుంచి ఆర్డర్‌ ప్రకారం ఇక ముందు సోషల్‌ మీడియాలో చిరంజీవి ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వినియోగిస్తే కఠినంగా చర్యలు తీసుకోబడుతాయి. ముఖ్యంగా ఏదైనా వాణిజ్యపరమైన అంశంకు లేదా పేక్ వీడియోల క్రియేషన్ కోసం చిరంజీవి ఫోటోలను వినియోగించకూడదు అని కోర్ట్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. గతంలో చేయబడిన డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించేందుకు గాను సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటికే చర్యలు తీసుకుంది. చిరంజీవి మాత్రమే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ముందు సెలబ్రిటీలకు సంబంధించిన డీప్‌ ఫేక్ వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ సిద్దం అవుతుందని తెలుస్తోంది.

మన శంకరవర ప్రసాద్‌ గారు సినిమా సంక్రాంతి రిలీజ్‌..

ఒక వైపు చిరంజీవి సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లతో పోరాటం చేస్తూనే మరో వైపు మన శంకరవర ప్రసాద్‌ గారు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. ఒక పక్కా కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన మీసాల పిల్ల పాట సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. లక్షల మంది ఈ పాటకు రీల్స్ చేయడంతో పాటు, స్టేజ్‌ పైనా డాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ పాటతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మరి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందా అనేది చూడాలి.