Begin typing your search above and press return to search.

రజినీకి లోకేష్.. మరి చిరుకు ఎవరు?

అయితే చిరు ఫ్యాన్స్.. ఆయనను ఒక హై ఎనర్జీ, పవర్ ఫుల్ సినిమాలో చూడాలని కలలు కంటున్నారు.

By:  M Prashanth   |   11 Aug 2025 9:00 PM IST
రజినీకి లోకేష్.. మరి చిరుకు ఎవరు?
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మేకర్స్ రీసెంట్ గా మూడో షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేశారు. వచ్చే నెలలో చిరు బర్త్ డే సందర్భంగా స్పెషల్ అప్డేట్ ఇస్తారని కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ను పెట్టనున్నారని.. అదే గ్లింప్స్ రూపంలో అనౌన్స్ చేయనున్నారని వినికిడి. అయితే అనిల్ రావిపూడి సినిమా తర్వాత చిరు.. శ్రీకాంత్ ఓదెలతో వర్క్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించనున్న ఆ సినిమా అనౌన్స్మెంట్ ను మేకర్స్ కొద్ది రోజుల ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే చిరు ఫ్యాన్స్.. ఆయనను ఒక హై ఎనర్జీ, పవర్ ఫుల్ సినిమాలో చూడాలని కలలు కంటున్నారు. భారీ హైప్ ఉన్న మూవీలో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నారు. వేరే లెవెల్ హిట్ ను సొంతం చేసుకుని.. మళ్లీ అప్పటి మ్యాజిక్ రిపీట్ చేయాలని కోరుతున్నారు. ఒకప్పుడు ఆస్వాదించిన గొప్ప ఇమేజ్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

అందుకు గాను సరైన దర్శకుడిని మెగాస్టార్ పట్టుకోవాలని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ గురించి ప్రస్తావిస్తున్నారు. వారిద్దరి కలయికలో ఇప్పుడు కూలీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14న రిలీజ్ కానుంది.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఆ సినిమాపై వేరే లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ భారీ రెస్పాన్స్ ను అందుకుంటోంది. మూవీపై ఆడియన్స్ లో ఫుల్ గా హైప్ ను క్రియేట్ చేస్తోంది. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా లోకేష్ వల్లే ఎక్కువగా అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఆయన తీసిన సినిమాలన్నీ ఆడియన్స్ ను విపరీతంగా అలరించాయి. ఇప్పుడు కూలీ కూడా మెప్పిస్తుందని అంతా డిసైడ్ అయ్యారు. రజినీ స్టామినాను లోకేష్ కరెక్ట్ గా చూపిస్తారని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు చిరు.. ఆ స్థాయి ఉత్సాహాన్ని సృష్టించడానికి క్యాలిబర్ ఉన్న దర్శకుడితో సినిమా చేయాలని అంతా కోరుకుంటున్నారు. మరి మెగాస్టార్ తన అప్ కమింగ్ మూవీస్ విషయంలో ఏం చేస్తారో చూడాలి.