Begin typing your search above and press return to search.

మెగాస్టార్ లో మాస్ త‌ప్ప న‌టుడ్ని వాడుకోలేదా?

వెండి తెర‌పై ఒక‌ప్ప‌టి మెగాస్టార్ చిరంజీవి..నేటి మెగాస్టార్ వేరు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 80-90-2000 ద‌శ‌కంలో చిరంజీవి ఎలాంటి పాత్ర‌లతో అల‌రించే వారో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   16 Feb 2026 1:00 AM IST
మెగాస్టార్ లో మాస్ త‌ప్ప న‌టుడ్ని వాడుకోలేదా?
X

వెండి తెర‌పై ఒక‌ప్ప‌టి మెగాస్టార్ చిరంజీవి..నేటి మెగాస్టార్ వేరు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 80-90-2000 ద‌శ‌కంలో చిరంజీవి ఎలాంటి పాత్ర‌లతో అల‌రించే వారో చెప్పాల్సిన ప‌నిలేదు. పాత్ర‌కే వ‌న్నే తీసుకొచ్చిన గొప్ప న‌టుడు. కెరీర్ ఆరంభంలో చిరంజీవి పోషించిన పాత్రలు ఎంతో అసాధార‌ణ‌మైన‌వి. ఆయ‌న మెగాస్టార్ గా ఎదిగారు అంటే అప్ప‌టి క‌ష్ట‌మే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న‌లో మాస్ తో పాటు, న‌ట‌న‌ కూడా బ్యాలెన్స్ గా వినియోగించుకున్నవారెంతో మంది. కానీ కంబ్యాక్ త‌ర్వాత చిరంజీవిలో మాస్ కోణాన్ని త‌ప్ప న‌ట‌న‌ను స‌ద్వినియోగం చేసుకోలేద‌నే చ‌ర్చ నెట్టింట జ‌రుగుతోంది.

'ఖైదీ నెంబ‌ర్ 150'తో చిరంజీవి కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. వి. వివినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ చిత్రం స్టోరీ స‌హా చిరంజీవి ఇమేజ్ తో ఆడేసింది. ఆ సినిమా కోసం చిరంజీవి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డింది లేదు. డాన్సుల్లో మాత్రం త‌న దైన మార్క్ వేసారు. అటుపై 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో సెటిల్డ్ పెర్పార్మెన్స్ తో అల‌రించారు. కానీ ఉయ్యాలవాడ న‌ర‌సింహా రెడ్డి పాత్ర మాత్రం అంత ఎఫెక్టివ్ గా అనిపించ‌లేదు. అటుపై అన్న‌య్య న‌టించిన 'ఆచార్య‌', 'గాడ్ ఫాద‌ర్', 'వాల్తేరు వీర‌య్య' లాంటి సినిమాల‌న్ని మెగా స్వాగ్ తో ఆడిన చిత్రాలే. బాస్ మాస్ ఇమేజ్ తో నే వీర‌య్య సినిమా ఆడేసింది.

వీర‌య్య లాంటి పాత్ర‌లు చిరంజీవికి కొట్టిన పిండి. చిరంజీవి తెర‌పై న‌టించాల్సిన ప‌నిలేదు. క‌నిపిస్తే చాలు అన్న ఇమేజ్ తోనే చాలా సినిమాలు ఆడేసాయి. అయితే ఇటీవ‌లే రిలీజ్ అయిన 'మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు' లో మాత్రం మెగాస్టార్ లో నటుడిని అనీల్ రావిపూడి నూటికి నూరుపాళ్లు స‌ద్వినియోగం చేసుకున్నాడు. వాస్త‌వానికి ఆ పాత్ర‌ని చిరంజీవి కొత్త‌గా చేయాల‌నుకున్నారు. కానీ అనీల్ అలాంటి సాహ‌సాలు వ‌ద్దు అని ఓపెన్ గానే చెప్పేసారు. త‌న‌లో పాత చిరంజీవిని చూపిస్తే చాలు అని హింట్ ఇచ్చి వ‌దిలేసాడు. దీంతో ఆ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డం చిరంజీవికి సుల‌భ‌మైంది.

ఈ విష‌యంలో చిరంజీవిని ఎక్క‌డా నొప్పించ‌కుండా అనీల్ తెలివిగా ఔట్ పుట్ తీసుకున్నాడు. అలాగే 'బింబిసార' ద‌ర్శ‌కుడు వ‌శిష్ట కూడా తెలివైన డైరెక్ట‌ర్. ఇప్ప‌టికే చిరంజీవితో 'విశ్వ‌భ‌ర' అనే సోషియా ఫాంట‌సీ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి పాత్ర ప‌రంగా కొన్ని పాత రిఫ‌రెన్స్ లు కూడా తీసుకునే డిజైన్ చేసాడు. 'ఆప‌ద్భాందవుడు' సినిమాలో శివుడు స‌న్నివేశం య‌ధాత‌ధంగా విశ్వంభ‌రలో ఉంటుంద‌ని తెలుస్తోంది. అలాగే చిరంజీవి ఓల్డ్ స్వాగ్ కూడా సినిమాలో హైలైట్ అవుతుంద‌ని స‌మాచారం. చిరంజీవి తో 'ద‌సరా' ఫేం శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేస్తున్నాడు. ఇది రాక్ష‌సుడు చిత్రం త‌ర‌హాలో ఉంటుంద‌ని ప్ర‌చారంలో ఉంది. చిరంజీవి పాత్ర‌ చాలా మాసివ్ గా ఉంటుం ద‌ని..ఎంతో కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తున్న‌ట్లు వినిపిస్తోంది. స్టోరీ స‌హా చిరంజీవి పాత్ర‌పై- శ్రీకాంత్ చాలా గ్రౌండ్ వ‌ర్క్ చేసాడంటున్నారు. ఈ నేప‌థ్యంలో అప్ క‌మింగ్ చిత్రంలో చిరంజీవి రోల్ ఓల్డ్ స్వాగ్ లోకి తీసుకెళ్తుంద‌ని చెప్పొచ్చు.