Begin typing your search above and press return to search.

KVN బ్యానర్ దూకుడు.. చిరు- బాబీ కాన్సెప్ట్ పోస్టర్ వేరే లెవెల్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. వరుస మూవీ అప్డేట్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నాయి.

By:  M Prashanth   |   22 Aug 2025 6:59 PM IST
KVN బ్యానర్ దూకుడు.. చిరు- బాబీ కాన్సెప్ట్ పోస్టర్ వేరే లెవెల్!
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. వరుస మూవీ అప్డేట్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే విశ్వంభర మూవీ గ్లింప్స్ రిలీజ్ కాగా.. అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇప్పుడు చిరంజీవి- దర్శకుడు బాబీ మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

బ్లాక్ బస్టర్ హిట్ వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత మరోసారి చిరుతో వర్క్ చేస్తున్నట్లు బాబీ అనౌన్స్ చేశారు. మెగా 158, Chiru Bobby2, #ABC - Again Bobby Chiru వర్కింగ్ టైటిల్స్‌ తో ప్రకటించారు. ఆ సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

శాండల్ వుడ్ కు చెందిన ఆ బ్యానర్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేస్తోంది. కన్నడ చిత్రాలతో తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేస్తోంది. తన సత్తా ఏంటో చాటేందుకు సిద్ధంగా ఉంది. కోలీవుడ్, మాలీవుడ్ లోకి కూడా ఇప్పటికే అడుగుపెట్టింది.

ఇప్పుడు చిరంజీవి- బాబీ మూవీతో ప్రతిష్టాత్మకంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే వాల్తేరు వీరయ్య మూవీ ద్వారా మాస్ ఫన్ ను అందించిన బాబీ.. ఇప్పుడు మరోసారి ఆయన కోసం ఎలాంటి స్టోరీ సిద్ధం చేశారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు కాన్సెప్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గోడకు గొడ్డలి వేటుతో రక్తపు ధార వచ్చినట్లు కాన్సెప్ట్ పోస్టర్ ను డిజైన్ చేశారు మేకర్స్. రక్తపు బెంచ్ మార్క్‌ ను డిసైడ్ చేసిన కత్తి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే క్యాప్షన్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయని నెటిజన్లు చెబుతున్నారు. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా మూవీ ఉండనున్నట్లు అర్థమవుతుందని అంటున్నారు.

మాస్ రాంపేజ్ పోస్టర్ అంటూ సందడి చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ ఉండనుందని అంటున్నారు. అయితే చిరంజీవిని ఇదివరకు ఎన్నడూ చూడని యాక్షన్ అవతార్ లో బాబీ చూపించనున్నారని మేకర్స్ హామీ ఇస్తున్నారు. దీంతో మరోసారి వారి కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే చిరు, బాబీ మూవీ షూటింగ్ 2025 చివరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బాబీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రతి ఒక్క అప్డేట్ కూడా కొత్తగా ఉంటుందని, అందరినీ అట్రాక్ట్ చేస్తుందని వెల్లడించారు.