చిరు ప్లాన్ ఏంటి? దావోస్ వెళ్లిందెందుకు?
ప్రస్తుతం సక్సెస్ మోడ్ లో ఉన్న చిరు.. రీసెంట్ గా మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో అనేక విషయాలపై రెస్పాండ్ అయ్యి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By: M Prashanth | 29 Jan 2026 12:25 PM ISTమెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. మూవీలో వింటేజ్ లుక్ లో అందరినీ మెప్పించారు. ప్రస్తుతం సక్సెస్ మోడ్ లో ఉన్న చిరు.. రీసెంట్ గా మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో అనేక విషయాలపై రెస్పాండ్ అయ్యి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ముందుగా పాలిటిక్స్ కు వెళ్ళాక సినీ ఇండస్ట్రీతో కనెక్షన్ మిస్ అయిందని గుర్తు చేసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు మూవీస్ తో డిస్ కనెక్ట్ అయ్యానన్న మెగాస్టార్.. ఎంతలా అంటే? కాజల్, తమన్నా తనకు తెలియదని చెప్పారు. ఖైదీ నెంబర్ 150 మూవీకి కాజల్ ఫిక్స్ చేస్తే ఎవరని అడిగానని అన్నారు. రెండు ఫీల్డ్స్ ను డీల్ చేయడం తన వల్ల కాలేదని, పవన్ కళ్యాణ్ కు మాత్రం ఆ స్టామినా ఉందని తెలిపారు చిరంజీవి.
ఆ తర్వాత తనకు పాడ్ కాస్ట్ లు చేయాలని ఉందని చెప్పారు. లైఫ్ లో తాను నేర్చుకున్న పాఠాలను, ఎక్స్పీరియన్స్ లను అందులో చెప్పాలని ఉన్నట్లు తెలిపారు. అయితే కొందరికి తనపై డాక్యుమెంటరీ తీయాలని ఉందని వెల్లడించారు. అదే సమయంలో డైరెక్టర్ బాబీతో చేయనున్న మూవీ అప్డేట్ ఇచ్చారు. ఆ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా, కంప్లీట్ బాబీ స్టైల్ లో ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇక చిరంజీవి స్టూడియో కడతారని వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అసలు తనకు ఆ ఆసక్తి లేదన్నారు. నిజంగా తనకు బిజినెస్ చేయడం రాదని, ఎప్పుడూ స్టూడియో కడతానని చెప్పలేదని తెలిపారు. స్టూడియోస్ ప్రాఫిట్ ఎలిమెంట్ కాదని, ఆస్తి మాత్రం పెరుగుతుందని అన్నారు. ఏదేమైనా సిబ్బంది మీద ఆధారపడి వ్యాపారం చేయడం తనకు వీలు కాదని, అలాంటివన్నీ అల్లు అరవింద్ కే సాధ్యమని వెల్లడించారు చిరు.
రీసెంట్ గా చిరు దావోస్ లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. దానిపై మాట్లాడిన ఆయన.. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అందరూ ఫ్రెండ్సేనని, దావోస్ కు అనుకోకుండా వెళ్లానని తెలిపారు. దీంతో అక్కడ ఉన్న కొందరు మిత్రులు.. ఇండస్ట్రీ తరఫున కార్యక్రమానికి హాజరవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. అందుకే వెళ్లానని అన్నారు.
ఆ తర్వాత సరైన సందర్భం దొరికితే టాలీవుడ్ తరఫున పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే బాగుంటుందని మనసులో మాటను బయెట్టారు. కావాలంటే మీడియా వాళ్ళు అది చేయొచ్చని అన్నారు. తానెప్పుడూ మీడియాతో క్లోజ్ గా ఉంటానని, వారి కోసం అనేక డ్రెస్ లు మార్చి ఫోటో షూట్స్ చేస్తుంటానని తెలిపారు. తానెప్పుడూ బిజీగా ఉంటానని, అసలు ఖాళీ ఉండదని అన్నారు. రోజూ జిమ్, నిద్ర, షూటింగ్స్, వచ్చిన ఫ్రెండ్స్ ను కలవడం.. అలా సింపుల్ గా రోజు కంప్లీట్ అయిపోతుందని చెప్పుకొచ్చారు.
