తమన్ ఖాతాలోకి మరో క్రేజీ ప్రాజెక్టు రానుందా?
ఈ టైమ్ ను తమన్ చాలా చక్కగా వాడుకున్నారు. ఎక్కువ అవకాశాలను అందుకోవడంతో పాటూ తనకొచ్చిన అవకాశాలతో మంచి మ్యూజిక్ అందించి అందరినీ మెప్పించారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Aug 2025 10:44 AM ISTటాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల కొరత చాలానే ఉంది. అందుకే ఏ స్టార్ హీరో సినిమా కన్ఫర్మ్ అయినా వెంటనే దానికి ఎవరు మ్యూజిక్ అందిస్తున్నారనేది ఆడియన్స్ లో చాలా ఆతృతగా మారింది. ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చే బడా మ్యూజిక్ డైరెక్టర్లంటే టాలీవుడ్ లో ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. వారే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరియు తమన్ ఎస్.
లైవ్ షో లపై ఫోకస్ చేసిన దేవీశ్రీ
మ్యూజిక్ పరంగా వీరిద్దరూ ఒకరికొకరు చాలా టఫ్ కాంపిటిషన్. ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ అస్సలు ఖాళీ లేకుండా ఉండే దేవీ శ్రీ ప్రసాద్ స్పీడు గత కొంతకాలంగా బాగా తగ్గింది. అప్పుడప్పుడు సినిమాలొస్తున్నాయి తప్పించి ఒకప్పటిలా అయితే లేవు. దానికి కారణం ఒకప్పటితో పోలిస్తే ఆయన సంగీతంలో క్వాలిటీ తగ్గడంతో పాటూ మ్యూజిక్ కాన్సర్ట్స్‌పై ఫోకస్ చేయడం కూడా.
తమన్- దేవీ మధ్య టఫ్ కాంపిటీషన్
ఈ టైమ్ ను తమన్ చాలా చక్కగా వాడుకున్నారు. ఎక్కువ అవకాశాలను అందుకోవడంతో పాటూ తనకొచ్చిన అవకాశాలతో మంచి మ్యూజిక్ అందించి అందరినీ మెప్పించారు. అలా తమన్, దేవీ మధ్య కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు వీరిద్దరూ టాలీవుడ్ బడా మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో పలు క్రేజీ సినిమాలున్నాయి.
మరోసారి బాబీతో..
అందులో విశ్వంభర, మెగా157 రిలీజ్ కు రెడీ అవుతుండగా, ఆ సినిమాల తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా, బాబీ కొల్లితో ఓ సినిమాను లైన్ లో పెట్టారు మెగాస్టార్. వీటిలో ముందుగా బాబీ సినిమానే ముందుగా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆగస్ట్ 22న చిరూ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా రానున్నట్టు సమాచారం. ఆల్రెడీ చిరూ- బాబీ కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య రాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
చిరూ-బాబీ మూవీకి తమన్
ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి కూడా దేవీ శ్రీ ప్రసాదే సంగీతం అందిస్తారని అంతా అనుకున్నారు కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారీ బాబీ, తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే తమన్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్టు వచ్చినట్టవుతుంది. సెప్టెంబర్ నుంచి బాబీ- చిరూ మూవీ మొదలవుతుందని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతన్నది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే కానీ తెలియదు.
