మెగా మాస్ మూవీకి.. ఆ చక్కన్నమ్మ ఎవరు..?
నవంబర్ నుంచి ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని బాబీ ఫిక్స్ అయ్యాడట. చిరుతో వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు బాబీ.
By: Ramesh Boddu | 13 Oct 2025 12:28 PM ISTమెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ విశ్వంభర కూడా నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ ప్లానింగ్ ఉంది. అందులో చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. నయనతార, త్రిష ఇద్దరు కూడా మెగా 156,157 సినిమాల్లో నటిస్తున్నారు. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబో సినిమా ఒకటి రాబోతుంది.
చిరంజీవి మాస్ ఏంటో చూపించాలని ఫిక్స్..
నవంబర్ నుంచి ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని బాబీ ఫిక్స్ అయ్యాడట. చిరుతో వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు బాబీ. ఐతే ఆ సినిమాను వింటేజ్ చిరు కామెడీ టైమింగ్ తో తీసుకెళ్లాడు. ఈసారి చిరంజీవి మాస్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడట. బాబీ ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ మాస్ ఫీస్ట్ ఇచ్చేలా స్టోరీ రాసుకున్నాడట. చిరు బర్త్ డే అనౌన్స్ మెంట్ తోనే గొడ్డలితో మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు బాబీ.
మెగా అభిమాని అయిన బాబీ మెగాస్టార్ ని ఎలా ఫ్యాన్స్ చూడాలని అనుకుంటున్నారో అలా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట కొనసాగుతుంది. సీనియర్ హీరోలతో చేస్తే హీరోయిన్స్ కెరీర్ అయిపోయినట్టే లాంటి అరిగిపోయిన ఔట్ డేటెడ్ కామెంట్స్ ఇప్పుడు వినిపించట్లేదు. సీనియర్ స్టార్ అయినా అది సినిమా కాబట్టి అందులో మంచి పాత్ర వస్తే చేయడంలో తప్పులేదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఇద్దరు భామల పేర్లు వినిపిస్తున్నాయి అందులో ఒకరు రాశి ఖన్నా కాగా మరొకరు మాళవిక మోహనన్.
రాజా సాబ్ బ్యూటీ మాళవిక మోహనన్..
రాశి ఖన్నా మళ్లీ తెలుగులో సందడి చేస్తుంది. సిద్ధు తెలుసు కదాలో నటించిన అమ్మడు పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఛాన్స్ అందుకుంది. ఇప్పుడు చిరు సినిమా డిస్కషన్ లో ఉంది. మరో సైడ్ రాజా సాబ్ బ్యూటీ మాళవిక మోహనన్ కూడా చిరంజీవితో నటించే ఛాన్స్ ఉందని టాక్. కోలీవుడ్, మలయాళం సినిమాల్లో రాణిస్తున్న మాళవిక తెలుగులో ప్రభాస్ రాజా సాబ్ తో ఎంట్రీ ఇస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరైనా మెగాస్టార్ కి జోడీగా బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి మెగా మాస్ మూవీకి ఆ హీరోయిన్ గా ఫైనల్ ఛాన్స్ కొట్టేసే ఆ చక్కనమ్మ ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
