Begin typing your search above and press return to search.

చిరు, బాబీ.. కథకు తగ్గట్లే మళ్ళీ ఇద్దరు!

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' అందించిన జోష్‌తో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు.

By:  M Prashanth   |   20 Jan 2026 9:33 AM IST
చిరు, బాబీ.. కథకు తగ్గట్లే మళ్ళీ ఇద్దరు!
X

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' అందించిన జోష్‌తో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు బాబీతో ఆయన చేయబోయే చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. 'వాల్తేరు వీరయ్య' వంటి మాస్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర, కథా నేపథ్యంపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ లీక్స్ బయటకు వస్తున్నాయి.

​ఈ క్రేజీ ప్రాజెక్టులో చిరంజీవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం మెగాస్టార్ భార్యగా ఒక సీనియర్ హీరోయిన్, కూతురిగా ఒక యంగ్ హీరోయిన్ కనిపించనున్నారని సమాచారం. పాత్రల వయస్సు, ప్రాధాన్యతకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేయాలని దర్శకుడు బాబీ భావిస్తున్నారట. ఈ నిర్ణయం వల్ల సినిమాలో ఒక రకమైన నోస్టాల్జిక్ ఫీల్ రావడంతో పాటు, మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పాత్రలు హుందాతనంతో ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

​గతంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో చిరంజీవి మాస్ అవతార్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తోనే ఆయన వస్తున్నారు. ఒకవైపు కమర్షియల్ అంశాలను మిస్ చేయకుండానే, మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉండేలా బాబీ ఈ కథను సిద్ధం చేశారట. సీనియర్ హీరోయిన్ తో చిరంజీవి జోడీని చూడటం అభిమానులకు పాత రోజులను గుర్తు చేయనుంది.

​ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది. 'విశ్వంభర', 'శ్రీకాంత్ ఓదెల' సినిమాలతో పాటు బాబీ సినిమా కూడా చిరంజీవి లైనప్‌లో చేరడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. వరుసగా భిన్నమైన జానర్స్ ట్రై చేస్తున్న చిరంజీవి, ఈ సినిమాలో ఫ్యామిలీ బాండింగ్ ఉన్న పాత్రను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. జనవరి 25న జరగబోయే లాంచ్ వేడుకతో ఈ సినిమాపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

​'మన శంకరవరప్రసాద్ గారు' ఇచ్చిన సక్సెస్ ట్రాక్ ను బాబీ కూడా కంటిన్యూ చేస్తారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంచనాలకు తగ్గట్టుగా హీరోయిన్ల ఎంపిక జరిగితే సినిమాకు మరింత హైప్ రావడం ఖాయం. అటు మాస్ అడియన్స్ ను, ఇటు ఫ్యామిలీ అడియన్స్ ను అలరించేలా మెగాస్టార్ తన లైనప్ ను పక్కాగా సెట్ చేసుకున్నారు. మరి ఈసారి బాబీ మెగాస్టార్ ను ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి.