Begin typing your search above and press return to search.

చిరు, బాబీ ప్రాజెక్ట్.. ఇప్పుడేం జరుగుతోంది?

ఇప్పటికే తాను వర్క్ చేసిన యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు మెగాస్టార్. వారి కాంబినేషన్ లో ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీ రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

By:  M Prashanth   |   15 Nov 2025 6:00 PM IST
చిరు, బాబీ ప్రాజెక్ట్.. ఇప్పుడేం జరుగుతోంది?
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశ్వంభర సినిమాను పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు ప్రాజెక్టును కంప్లీట్ చేస్తున్నారు. చివరి దశకు షూటింగ్ చేరుకోగా.. ఫైనల్ టచ్ ఇస్తున్నారు. అది పూర్తయిన వెంటనే మరో సినిమాకు సిద్ధమవుతున్నారు చిరు.

ఇప్పటికే తాను వర్క్ చేసిన యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు మెగాస్టార్. వారి కాంబినేషన్ లో ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీ రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి హిట్ కాంబో రిపీట్ కానుంది. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో చిరు- బాబీ సినిమా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఆగస్టు నెలలో సినిమాను లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. ఆ తర్వాత డిసెంబర్ లో షూటింగ్ ను మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది జరగడం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో చిత్రీకరణను మొదలు పెట్టాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయనున్నారట.

ఎందుకంటే.. ఇప్పుడు బాబీ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ సూచనల మేరకు కొన్ని ఛేంజెస్ ను చేస్తున్నారని సమాచారం. ఆ వర్క్ కంప్లీట్ అయ్యాక అఫీషియల్ గా లాంచింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని సమాచారం. జనవరి లాస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని వినికిడి.

ఇక సినిమా విషయానికొస్తే.. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మాలీవుడ్ టాప్ డీవోపీ నిమిష్ రవి సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారని సమాచారం. ముందు కార్తీక్ ఘట్టమనేని.. సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నారని వార్తలు రాగా.. ఆ తర్వాత ఆయన తప్పుకున్నట్లు వినికిడి.

మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి కూడా భాగంగా కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడు- నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటించే అవకాశం ఉందని టాక్ వస్తోంది. హీరోయిన్‌గా మాళవిక మోహనన్ పేరు వినిపించినా, అది నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. సంగీత దర్శకుడిగా మొదట తమన్ పేరు వచ్చినా, ఆ తర్వాత రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.