బాబి, చిరు మరో సారి మ్యాజిక్ చేయడం పక్కా?
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కొల్లి కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ కామెడీ మూవీ `వాల్తేరు వీరయ్య`.
By: Ravindar Gorantla | 9 April 2026 4:12 PM ISTమెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కొల్లి కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ కామెడీ మూవీ `వాల్తేరు వీరయ్య`. మాస్ మహారాజా రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అతిథి పాత్రలో నటించగా, శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్‌లుగా నటించారు. ఓదశలో చిరు క్యారెక్టర్‌ని డామినేట్ చేసిన రవితేజ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌కి ప్రధాన కారణంగా నిలిచాడు. 2023 సంక్రాంతికి బరిలో నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైనే రాబట్టి చిరు సినిమాల్లో వసూళ్ల పరంగా రికార్డు సాధించింది.
ఈ సినిమాతో తొలిసారి మెగాస్టార్, బాబి కొల్లి కలిసి వర్క్ చేశారు. ఇందులో చిరుని చూపిచిన తీరు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు ఉంటుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూజ్ చెప్పారు. చిరు, బాబి కలయికలో పవర్‌ఫుల్ స్టోరీతో ఓ భారీ మూవీని `జన నాయగన్`, టాక్సిక్` చిత్రాల నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ సినిమా చేయబోతోందని ప్రచారం మొదలైంది.
దాన్ని నిజం చేస్తూ మేకర్స్ నుంచి అధికారక ప్రకటన కూడా రావడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. అయితే `జన నాయగన్` రిలీజ్ సెన్సార్ సమస్య కారణంగా ఇబ్బందుల్లో ఇరుక్కోవడం. అమెరికాన్, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో `టాక్సిక్` మూవీ రిలీజ్‌ని జూన్ 4కు పోస్ట్ పోన్ చేయడంతో చిరు ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది.
దళపతి విజయ్‌తో తీసిన `జన నాయగన్` తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాత రిలీజ్ అవుతుందనే క్లారిటీ రావడం, `టాక్సిక్` ఇప్పటికే జూన్ 4న వస్తామని ప్రకటించడంతో కెవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ తెలుగులో అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా చిరు, బాబిలతో చేయనున్న ప్రాజెక్ట్‌ని ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. గత కొన్ని నెలలుగా స్థబ్దంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఏప్రిల్ 11న భారీ స్థాయిలో ప్రారంభం కాబోతోంది.
`మన శంకర వరస్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని చిరు జోష్ మీదుండగా, `డాకు మహారాజ్`తో సక్సెస్‌ని సొంతం చేసుకుని రెట్టింటచి ఉత్సాహంతో చిరు ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాలనే తపనతో బాబి ఉన్నాఉ. వీరిద్దరి కలయికలో `వాల్తేరు వీరయ్య` తరువాత రానున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో సినిమాలని నిర్మించడంతో అభిరుచిగల నిర్మాతగా `జన నాయగన్`, టాక్సిక్‌లతో నిరూపించుకున్న వెంకట్ కె. నారాయణ చిరు మూవీని కూడా భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
